పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ఓజి . ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా నేడు రిలీజ్ అయిన సంగతి తెలిసిందే . సుజిత్ డైరెక్షన్లో రూపొందిన ఈ గ్యాంగ్ స్టార్ యాక్షన్ డ్రామా జనాలను బేభక్షంగా ఆకట్టుకుంటుంది . దీంతో ఈ చిత్రం చూసేందుకు జనాలు భారీ ఎత్తున ఎగబడుతున్నారు . అదేవిధంగా సినీ సెలెబ్రెటీలు కూడా ప్రీమియర్ షోలకు వెళ్లారు . మెగా హీరోలు అలాగే పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా అదేవిధంగా కూతురు ఆధ్యా కూడా ఈ సినిమా ను చూశారు .


మూవీ పై పాజిటివ్ టాక్ రావడంతో సోషల్ మీడియా మొత్తం ఓ జి ఫీవర్ అంటుకుంది . ఎక్కడ చూసినా ఓజీ వీడియోలే దర్శనమిస్తున్నాయి . ఇక ఈ మూవీ సక్సెస్ ట్రాక్ లో పడడంతో దర్శకుడు సుజిత్ భార్య ఎమోషనల్ అయ్యారు . నిన్న రాత్రి ఓజీ హీరోయిన్ ప్రియాంక మోహన్ మరియు అర్జున్ దాస్ తో కలిసి ప్రీమియర్ షోకు వెళ్లారు సుజిత్ భార్య ప్రవల్లిక .


ఇక ఈ మూవీ చూసినా అనంతరం కాస్త ఎమోషనల్ అయ్యారు సుజిత్ భార్య . కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు . ఓ జి మూవీ కోసం దర్శకుడు సుజిత్ 6 ఏళ్లు కష్టపడి సక్సెస్ అందుకున్నారు . ఈ నేపథ్యంలోనే ఆయన సతీమణి ఎమోషనల్ అయినట్లుగా తెలుస్తుంది . ప్రజెంట్ ఎందుకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . దీంతో సుజిత్ భార్య స్పెషల్ ఎట్రాక్షన్ గా మారింది . తన గురించి పది విషయాలు కూడా సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు . ఏదేమైనాప్పటికీ ఆరేళ్ల కష్టానికి సుజిత్ కి మంచి ఫలితం దక్కిందని చెప్పుకోవచ్చు . ఇక ఓజీ 2 కూడా రానున్నట్లు ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి . మరి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు రానుందో చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: