కోలీవుడ్లో స్టార్ హీరోగా పేరు సంపాదించిన ధనుష్ , హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ప్రేమలో ఉన్నట్లు కోలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి. గత కొద్దిరోజులుగా వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారనే ప్రచారం కూడా జోరుగానే వినిపించింది. ఈ విషయం పైన మృణాల్ ఠాకూర్ తమ మధ్య ఏమి లేదంటూ గత ఏడాది ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చినప్పటికీ నిన్నటి రోజు నుంచి పెళ్లి వ్యవహారం కోలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఫిబ్రవరి 14 (ప్రేమికుల రోజు) వీరిద్దరూ వివాహ జీవితంలోకి అడుగుపెట్టబోతున్నట్లు వినిపిస్తున్నాయి.



అయితే ఈ తాజా రూమర్స్ పై ధనుష్ కానీ, మృణాల్ ఠాకూర్ కాని ఏ విధమైనటువంటి క్లారిటీ ఇప్పటివరకు ప్రకటించలేదు. ధనుష్ చివరిగా ఇడ్లీ కొట్టు సినిమాలో నటించారు. ఈ సినిమాలో ధనుష్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. గతంలో సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు ఐశ్వర్యను 2004లో వివాహం చేసుకున్నారు. కొన్ని మనస్పర్ధలు కారణంగా 2024 లో ధనుష్, ఐశ్వర్య విడాకులు తీసుకున్నారు. అయితే వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. ధనుష్, ఐశ్వర్య విడాకుల వ్యవహారం  అటు అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది.


మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ లో ఎన్నో చిత్రాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో సీతారామం చిత్రంతో భారీ  పాపులారిటీ సంపాదించుకుంది. అలా తెలుగులో ఇప్పటికే నాలుగు చిత్రాలు చేసిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం హీరో అడవి శేషు తో కలిసి డేకాయిట్ చిత్రంలో కనిపించబోతోంది. మృణాల్ ఠాకూర్ సినిమా ఈవెంట్స్ కు ధనుష్ హాజరు కావడం వల్ల ఈ రూమర్స్ మొదలయ్యాయి. ఆ తర్వాత ధనుష్ సిస్టర్స్ ని కూడా మృణాల్ ఠాకూర్ సోషల్ మీడియాలో ఫాలో అవ్వడంతో ప్రేమ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చేలా చేశాయి. మరి ఈ విషయం పైన మరొకసారి ఎవరు క్లారిటీ ఇస్తారో చూడాలి మరి. మొత్తానికి ధనుష్, మృణాల్ పెళ్లి విషయం ఇండస్ట్రీలో సంచలనం గా మారింది..

మరింత సమాచారం తెలుసుకోండి: