టాలీవుడ్ ఇండస్ట్రీ లో దర్శకుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న వారిలో సూజిత్ ఒకరు. ఈయన శర్వానంద్ హీరోగా రూపొందిన రన్ రాజా రన్ అనే మూవీ తో దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టాడు. ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించడంతో ఈయనకు చిన్న వయసు లోనే దర్శకుడిగా మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈయన ఏకంగా రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా రూపొందిన సాహో అనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాకు దర్శకుడిగా వ్యవహరించాడు.

భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా పెద్ద స్థాయి విజయాన్ని అందుకోకపోయినా ఈ మూవీ ని తెరకెక్కించిన విధానానికి గాను సుజిత్ కు మంచి ప్రశంసలు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి దక్కాయి. సాహో సినిమా తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకున్న సుజిత్ , పవన్ కళ్యాణ్ హీరోగా ఓజి అనే సినిమాను స్టార్ట్ చేశాడు. ఈ మూవీ తాజాగా థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే కాస్త మిక్స్ డ్ టాక్ వచ్చింది. కానీ ఈ సినిమా కలెక్షన్లు మాత్రం అద్భుతమైన స్థాయిలో రాబడుతుంది. ప్రస్తుతం ఈ సినిమాకు వస్తున్న కలెక్షన్లను బట్టి చూస్తే ఈ మూవీ భారీ లాభాలను అందుకొని బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకునే అవకాశాలు కనబడుతున్నాయి.

ఓజి మూవీ సుజిత్ , నాని హీరోగా సినిమా చేయబోయే అవకాశాలు ఉన్నాయి అని బలమైన వార్తలు వచ్చాయి. ఇకపోతే ఓజి సినిమా సూపర్ సక్సెస్ అయ్యే అవకాశాలు ఉండడంతో సుజిత్ "ఓజి 2" మూవీ పై కాన్సన్ట్రేషన్ పెట్టినట్లు , అందులో భాగంగా అఖీరా నందన్ హీరోగా సుజిత్ "ఓజి 2" మూవీ చేయనున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ వార్త బయటికి రావడంతో నాని ఫ్యాన్స్ కాస్త కంగారు పడుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: