
సూపర్ సిక్స్ లో భాగంగా ఆడబిడ్డ నిధి స్కీమ్ అమలు పైన వైసిపి సభ్యులు ప్రశ్నలు వేయగా.. ఆడబిడ్డ నిధి అమలు చేయకుండా మహిళలను కూటమి ప్రభుత్వం మోసం చేస్తోంది అంటూ ఆరోపించారు! ఈ విషయం పైన మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ పథకాన్ని కచ్చితంగా అమలు చేసేలా ప్రభుత్వం పరిశీలన చేస్తోందని త్వరలోనే పూర్తి వివరాలు ప్రకటిస్తామంటూ తెలిపారు. గత ప్రభుత్వం లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ.. తల్లికి వందనం, స్త్రీశక్తి, పెన్షన్ పెంపు ఇలా ఎన్నో పథకాలను అమలు చేశాము. ఆడబిడ్డ నిధి పథకం పైన కూడా విధివిధానాల గురించి చర్చలు జరుగుతున్నాయంటూ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.
సూపర్ సిక్స్ లో ఇచ్చిన హామీలలో భాగంగా ఆడబిడ్డ నీది 18 నుంచి 59 సంవత్సరాల లోపు ఉన్న మహిళలకు అర్హులు.. ప్రతినెల రూ .1500 రూపాయలు సహాయం చేయడమే ఈ పథకం యొక్క ఉద్దేశం. కచ్చితంగా ఈ పథకాన్ని అమలు చేసి తీరుతామంటూ మంత్రి శ్రీనివాస్ వెల్లడించారు. ఇప్పటికే ఉచిత గ్యాస్, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం వంటి పథకాలతో కూటమి మైలేజ్ పెరిగింది. ఇప్పుడు ఆడబిడ్డ నీది పథకాన్ని అమలు చేస్తే కూటమి మైలేజ్ మరింత రెట్టింపు అవుతుందని కార్యకర్తలు నేతలు భావిస్తున్నారు.