టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ క్రేజ్ ను సంపాదించుకున్న నటీ మణులలో మీనాక్షి చౌదరి ఒకరు. ఈమె మోడలింగ్ రంగం నుండి సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈమె ఈచట వాహనములు నిలపరాదు అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈమెకు మొదటి విజయం అడవి శేషు హీరోగా రూపొందిన హిట్ ది సెకండ్ కేస్ అనే మూవీ ద్వారా దక్కింది. ఆ తర్వాత ఈమెకు వరుస పెట్టి తెలుగు సినిమాలను అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా ఈమె నటించిన కొన్ని సినిమాలు మంచి విజయాలను కూడా అందుకున్నాయి.

ఈమె ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించి , ఎన్నో విజయాలను అందుకుంది. అలాగే ఎన్నో సినిమాలలో తన అద్భుతమైన నటనతో , అందాల ప్రదర్శనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఆఖరుగా ఈ బ్యూటీ సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈమె నవీన్ పోలిశెట్టి హీరోగా రూపొందుతున్న అనగనగా ఒక రాజు అనే సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. 

ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ బాలీవుడ్ లో ఓ హిట్ సిరీస్ మూవీ లో అవకాశాన్ని దక్కించుకున్నట్లు తెలుస్తుంది. బాలీవుడ్ లో మంచి క్రేజ్ కలిగిన సిరీస్ మూవీలలో ఫోర్స్ సిరీస్ ఒకటి. ఫోర్స్ 3 మూవీ లో ఈ ముద్దుగుమ్మ హీరోయిన్గా సెలెక్ట్ అయినట్లు తెలుస్తోంది. ఫోర్సు 3 మూవీ లో జాన్ అబ్రహం హీరో గా నటించినుండగా ... ఆయనకు జోడిగా మీనాక్షి చౌదరి నటించబోతున్నట్లు తెలుస్తుంది. ఒక వేళ ఈ సినిమాలో ఈమెకు ఆఫర్ దక్కినట్లయితే ఇది ఈమెకి క్రేజీ ఆఫర్ అవుతుంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

mc