పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, సుజీత్ దర్శకత్వంలో వచ్చిన తాజా సినిమా “ ఓజి ” బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ రన్ చూపిస్తోంది. విడుదలకు ముందు నుంచే ఈ సినిమాపై ఉన్న అంచనాలు, హైప్ కారణంగా థియేటర్స్ దగ్గర భారీగా అభిమానులు క్యూ కట్టారు. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సంపాదించుకున్న ఈ సినిమా వరుసగా రికార్డులు బద్దలుకొడుతూ దూసుకెళ్తోంది. ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్‌లో కూడా ఈ సినిమాకు అపారమైన క్రేజ్ కనిపిస్తోంది. ముఖ్యంగా అమెరికా మార్కెట్‌లో “ఓజి” రికార్డు స్థాయి కలెక్షన్స్‌ను అందుకుంటోంది. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం ఈ సినిమా ఇప్పటికే 3.8 మిలియన్ డాలర్ల మార్క్‌ను దాటేసి... 4 మిలియన్ క్లబ్ వైపు దూసుకెళ్తోంది.


పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ఇదొక విశేషమైన రికార్డ్. గతంలో 3 మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరిన పవన్, ఇప్పుడు 4 మిలియన్ క్లబ్‌లో అడుగుపెట్టబోతుండటం ఆయన స్టార్‌డమ్‌కు నిదర్శనం. ఈ సినిమా సూప‌ర్ హిట్ అవ్వ‌డానికి ప్ర‌ధాన కార‌ణాల్లో పవన్ కళ్యాణ్ కెరెక్టరైజేషన్, యాక్షన్ సీక్వెన్సులు, థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా మంచి ఇంపాక్ట్ చూపించింది. డీవీవీ దానయ్య నిర్మాణ విలువలు సినిమాను మరింత గ్రాండ్‌గా నిలబెట్టాయి. పవన్ కళ్యాణ్ సినిమాలు ఓవర్సీస్ మార్కెట్‌లో ఎప్పుడూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈసారి కూడా ఓజీ కోసం అభిమానులు ఆతృత‌తో వెయిట్ చేయ‌డంతో ఓజీ ఓవ‌ర్సీస్‌లో రికార్డుల దుమ్ము దులిపేస్తోంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: