హీరో రామ్ చరణ్ ఈ ఏడాది నటించిన గేమ్ ఛేంజర్ సినిమా భారీ డిజాస్టర్ కావడంతో అభిమానులతో పాటు మెగా ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. ఎలాగైనా సక్సెస్ కొట్టాలని ఈసారి డైరెక్టర్ బుచ్చిబాబుతో పెద్ది సినిమా ప్లాన్ చేశారు. ఈ సినిమాకి సంబంధించి పెద్ది షాట్ అంటూ గ్లింప్స్ విడుదల చేయగా సూపర్ రెస్పాన్స్ లభించింది. దీంతో ఈ సినిమా షూటింగ్ ను త్వరగా పూర్తిచేసి విడుదల చేయాలనే ఉద్దేశంతో చిత్ర బృందం శరవేగంగా షూటింగ్ జరుపుతోంది. అయితే రామ్ చరణ్ నటించిన చిత్రాలలో ఒక బ్యాడ్ సెంటిమెంట్ వెంటాడుతోంది.


అదేమిటంటే ట్రైన్ ట్రాక్ ఎపిసోడ్. ఈ విషయంలో అభిమానులు కూడా ఎప్పటి నుంచో నిరుత్సాహంతో ఉన్నారు. గతంలో డైరెక్టర్ బోయపాటి శ్రీను, రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చిన వినయ విదేయ రామ చిత్రంలో కూడా ట్రైన్ ట్రాక్ సీన్ ఉన్నది. ఇది సినిమాకి హైలెట్ గా ఉంటుందనుకున్నప్పటికీ ఆ సినిమా ఫ్లాప్ గా మిగిలింది. ఈ ఏడాది భారీ అంచనాల మధ్య విడుదలైన గేమ్ ఛేంజర్ సినిమా విషయంలో కూడా ట్రైన్ సీన్ బాగానే ఉన్న సినిమా డిజాస్టర్ గా మిగిలింది.

ఇప్పుడు రామ్ చరణ్, బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తున్న పెద్ది చిత్ర విషయంపై కూడా ఫాన్స్ కి ఇదే భయం పట్టుకుంది. ఇటీవల రామ్ చరణ్ 18 ఏళ్ల సినీ కెరీర్ ని పూర్తి చేసుకున్న సందర్భంగా పెద్ది చిత్రం నుంచి రైల్వే ట్రాక్ పోస్టర్ ను విడుదల చేశారు. అయితే ఇందులో రైల్వే ట్రాక్ మీద రామ్ చరణ్ నిలబడి ఉన్న ఒక పోస్టర్ . పోస్టర్ అదిరిపోయే లాగా ఉన్న , రామ్ చరణ్ సినిమాలో  రైల్వే ట్రాక్ ఉన్న సినిమాలన్నీ కూడా ఫ్లాపులుగానే ఉన్నాయనే భయం ఫ్యాన్స్ లో కనిపిస్తోంది. మరి పెద్ది సినిమాతో అలాంటి వాటిని బ్రేక్ చేస్తారని అభిమానులు భావిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: