నందమూరి నటన సింహం బాలకృష్ణ ఈ మధ్య కాలంలో వరుస పెట్టి విజయాలను అందుకుంటూ అద్భుతమైన జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తున్న విషయం మనకు తెలిసిందే. బాలకృష్ణ కొంత కాలం క్రితం అఖండ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత వీర సింహా రెడ్డి , భగవంత్ కేసరి , డాకు మహారాజ్ సినిమాలతో విజయాలను అందుకున్నాడు. తాజాగా బాలకృష్ణ "అఖండ 2" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించిన అఖండ మూవీ కి కొనసాగింపుగా రూపొందింది. దానితో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరిగింది. ఇక ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న సినిమాల లిస్టు లో మంచి స్థానంలో నిలిచింది.

అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా రూపొందిన రెండు సినిమాల రెండు తెలుగు రాష్ట్రాల ఫ్రీ రిలీజ్ బిజినెస్ ను ఈ సినిమా క్రాస్ చేసింది. అసలు విషయం లోకి వెళితే ... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన వకీల్ సాబ్ మూవీ మంచి విజయం సాధించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 74.35 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక పవన్ కళ్యాణ్ హీరో గా రూపొందిన బ్రో సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 80.50 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇకపోతే అఖండ 2 మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 88.25 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇలా పవన్ కళ్యాణ్ హీరో గా రూపొందిన వకీల్ సాబ్ , బ్రో సినిమాల రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులను భారీ మార్జిన్ తో ఆఖండ 2 మూవీ దాటేసింది. అఖండ 2 మూవీ ఈ రోజు విడుదల కావాల్సింది. కానీ కొన్ని అవివార్య కారణాల వల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: