
నిరంతరం ఎప్పుడూ కూడా విభిన్నమైన కథలను ఎంచుకొని సినిమాలు చేస్తున్నారు.. నార్నే నితిన్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే గత ఏడాది నవంబర్ లో శివాని అనే అమ్మాయి తో చాలా గ్రాండ్గా ఎంగేజ్మెంట్ జరుపుకున్న సంగతి అందరికీ తెలిసిందే .ఈ వేడుకలకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో పాటు టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు. అయితే ఎంగేజ్మెంట్ జరిగీ ఏడాది కావోస్తూ ఉన్న ఇంకా వివాహ తేదీని ప్రకటించకపోవడంతో ఫ్యాన్స్ నిరుత్సాహంతో ఉన్నారు.
అయితే ఇప్పుడు తాజాగా నార్నే నితిన్, శివాని వివాహ తేదీ అక్టోబర్ 10వ తేదీన ఫిక్స్ అయినట్లు వినిపిస్తున్నాయి. ఈ వేడుకలకు సంబంధించి ప్రస్తుతం పనులయితే జరుగుతున్నాయని ఎన్టీఆర్, ప్రణతి ఈ పనులలోను కొంతమేరకు బిజీగా ఉన్నట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. నార్నే నితిన్ చేసుకోబోయే భార్య రాజకీయ కుటుంబానికి చెందిన అమ్మాయి అన్నట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా విక్టరీ వెంకటేష్ ఫ్యామిలీకి కూడా దగ్గరి బంధువు అనే ప్రచారం కూడా వినిపిస్తోంది. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ మొత్తానికి నార్నే నితిన్ పెళ్లికి సంబంధించి ఈ న్యూస్ వైరల్ గా మారింది. మరి ఈ విషయం పైన ఏ విధమైనటువంటి క్లారిటీ ఇస్తారు చూడాలి.