
తాజాగా విడుదలైన టీజర్ మరింత చర్చనీయాంశంగా మారింది. రామ్ పోతినేని ఎనర్జీ, డైలాగ్ డెలివరీ, మాస్ బాడీ లాంగ్వేజ్ టీజర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అదే సమయంలో హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే గ్లామర్, స్క్రీన్ ప్రెజెన్స్ కూడా మంచి హైలైట్‌గా మారాయి. టీజర్‌లో ఉన్న ఎమోషనల్ టచ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా రామ్ పోతినేని పాత్ర కన్నడ స్టార్ హీరో ఉపేంద్రకు వీరాభిమానిగా ఉండటం కథలో ఆసక్తికరమైన కోణంగా కనిపిస్తోంది. టీజర్‌లో అభిమాని తన ఇష్టమైన హీరో కోసం ఎలాంటి త్యాగాలు చేస్తున్నాడో, తన ఆరాధనను ఎంత దూరం తీసుకెళ్తున్నాడో చూపించే సన్నివేశాలు ఉండటంతో, చాలా మంది ప్రేక్షకులు భావోద్వేగానికి గురయ్యారు. అయితే టీజర్ చివర్లో వచ్చే ఒక డైలాగ్ మాత్రం ఇప్పుడు పెద్ద వివాదానికి దారి తీసింది. “ఫ్యాన్ ఫ్యాన్ అని నువ్వు గుడ్డలు చింపేసుకోవడమే కానీ... నువ్వు ఒకడివి ఉన్నావు అనే విషయం వాళ్లకి తెలియదు. ఏం బ్రతుకులు రా మీవి!” — అంటూ వచ్చే ఈ ఘాటు డైలాగ్ ప్రతి అభిమాని హృదయాన్ని తాకేలా ఉంది.
ఈ డైలాగ్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. కొందరు దీన్ని “స్టార్ హీరోల ఫ్యాన్స్‌కి కౌంటర్‌గా ఉన్న డైలాగ్” అంటూ అనుకుంటున్నారు. “ప్రతి హీరో సినిమా రిలీజ్ అయ్యే సమయాల్లో ఫ్యాన్స్ గొంతు చించుకొని అరవడం, థియేటర్లలో హడావిడి చేయడం తప్పితే, వారి నిజమైన భావాలను హీరోలు ఎప్పుడూ గుర్తించలేదు” అని కొందరు వాదిస్తున్నారు. ఈ ఒక్క డైలాగ్‌తోనే సినిమా చుట్టూ పెద్ద చర్చ మొదలైంది.సినిమా ఇంకా రిలీజ్ కాకముందే ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ పెద్ద కాంట్రవర్సీలో చిక్కుకుంది. అభిమాన వర్గాలు సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు రచ్చ రంబోలా చేస్తున్నారు. కొందరు రామ్ పోతినేనికి సపోర్ట్ చేస్తుంటే, మరికొందరు మాత్రం ఈ డైలాగ్ అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి చిన్న టీజర్‌తోనే సినిమా మీద బజ్ మల్టీఫోల్డ్‌గా పెరిగిపోయింది.
ఇప్పుడు అందరి దృష్టి చిత్రబృందం మీదే. ఈ వివాదంపై డైరెక్టర్ పి. మహేష్ లేదా రామ్ పోతినేని ఎలా స్పందిస్తారో చూడాలి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తోంది — ఈ టీజర్‌తో ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమా మీద అంచనాలు మరింత పెరిగాయి. అభిమాన భావోద్వేగాలను, వారి త్యాగాలను చూపించే కథతో వస్తున్న ఈ సినిమా, విడుదలైన రోజు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటుందా, లేక ఈ కాంట్రవర్సీ సినిమాకి ఆటంకమవుతుందా అన్నది వేచి చూడాల్సిందే..?