
సమంత మాట్లాడుతూ.. తన జీవితంలో జరిగిన ప్రతి విషయం కూడా ప్రజల సమక్షంలోనే జరిగింది. తాను జీవితంలో ఎన్నో విషయాలలో తడబడివచ్చానని, తప్పులు చేశాను, దెబ్బలు తిన్నాను అందుకే ప్రస్తుతం తన జీవితంలో మెరుగుపడడానికి ప్రయత్నిస్తున్నానని , తనని అనుసరించిన ఎవరికైనా సరే తన వ్యక్తిగత పోరాటాల గురించి తెలుస్తుంది అంటూ సమంత తెలిపింది. విడిపోవడం, అనారోగ్యం వంటి ఇబ్బందులు సమంత బహిరంగంగానే తెలియజేసింది. అలాగే తన మీద ట్రోలింగ్స్ కూడా చాలానే వచ్చాయని, వాటి వల్ల ఎన్నో సార్లు బాధపడ్డానని, ప్రతి ఒక్కరు కూడా ఎలా జీవిస్తున్నారనే విషయాన్ని చూస్తారని, కానీ బాధ్యతాయతంగా ఎంతమంది ఉంటున్నారనే విషయమే ముఖ్యమని తెలిపింది.
ప్రస్తుతం యువత తమ మార్గదర్శకులను చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలని అది వారి జీవితాలను మార్చేయగలదని తెలిపింది. తాను ఒక సామాన్యమైన నేపథ్యం నుంచి వచ్చానని తన కుటుంబం ఆహారం పెట్టడానికి కూడా ఎన్నో కష్టాలను పడిందని తెలిపింది.. కీర్తి, సంపద తనకు ఒక లక్ష్యాన్ని గుర్తు చేశాయని ఆ లక్ష్యం వైపు గానే అడుగులు వేశానని తెలిపింది సమంత. సమంత సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల శుభం అనే సినిమాతో నిర్మాతగా మారి సక్సెస్ అయ్యింది. ఇందులో ఒక కీలకమైన పాత్రలో కూడా నటించింది. అలాగే తన సొంత బ్యానర్ పైన మా ఇంటి బంగారం అనే సినిమాని చేస్తోంది. అలాగే బాలీవుడ్ లో రక్తబ్రహ్మాండ్ అనే వెబ్ సిరీస్లో నటిస్తోంది.