నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న అఖండ 2 అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని డిసెంబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ తర్వాత బాలయ్య , గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు. ఇప్పటికే ఆ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇకపోతే సడన్గా బాలయ్య నెక్స్ట్ మూవీ కి సంబంధించి బ్రేక్ పడే అవకాశాలు ఉన్నాయి అంటూ ఓ వార్త వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి గోపీచంద్ మలినేని కొంత కాలం క్రితం బాలీవుడ్ నటుడు అయినటువంటి సన్ని డియోల్ హీరో గా జాట్ అనే హిందీ సినిమాను రూపొందించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఆ తర్వాత ఓ టీ టీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ మూవీ అక్కడ కూడా మంచి రెస్పాన్స్ ను దక్కించుకుంది. ప్రస్తుతం గోపీచంద్ మలినేని "జాట్" మూవీ కి కొనసాగింపుగా జాట్ 2 మూవీ ని రూపొందించాలి అనే ఆలోచనలో ఉన్నట్లు , ప్రస్తుతం అందుకు సంబంధించిన పనుల్లో ఆయన బిజీగా ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇలా గోపీచంద్ మలినేని జాట్ 2 మూవీ కి సంబంధించిన పనులను ఇప్పటికే ప్రారంభించినట్లు వార్తలు వస్తుండడంతో మరి ఈ దర్శకుడు మొదట బాలకృష్ణ తో సినిమా చేస్తాడా ..? లేక జాట్ 2 మూవీ ని స్టార్ట్ చేస్తాడా ..? అనే ఆసక్తి చాలా మంది లో నెలకొంది. ఒక వేళ గోపీచంద్ మొదట జాట్ మూవీ ని గనుక ప్రారంభించినట్లయితే బాలకృష్ణ , గోపీచంద్ కాంబోలో రూపొందబోయే సినిమా కాస్త డిలే అయ్యే అవకాశం ఉంది అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు. ఇక మరి కొంత మంది మాత్రం మొదట గోపీచంద్ , బాలకృష్ణ తో సినిమా చేసి ఆ తర్వాత జాట్ 2 మూవీ ని మొదలు పెడతాడు అని అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: