ప్రస్తుతం సోషల్ మీడియాలో రష్మిక మందన్నాను కేంద్రబిందువుగా చేసుకుని కొత్త ట్రెండ్స్ సృష్టమవుతున్నాయి. ఈ హీరోయిన్‌ తన సోషల్ మీడియా వేదికపై తరచూ పిక్స్‌ను షేర్ చేస్తూ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ విష్యం అందరికి బాగా తెలుసు. చిన్న ఈవెంట్ అయినా, చిన్న ఫంక్షన్ అయినా రష్మిక షేర్ చేసిన ఫోటోలు వెంటనే హైలెట్ అవుతాయి. అభిమానులతో నిరంతరం టచ్ లోనే ఉంటుంది. ఈ కారణంగానే ఆమెను చాలా మంది ఫాలో అవుతూ, లైక్ చేస్తూ ఉంటారు. అయితే, రీసెంట్‌గా దీపావళి సందర్భంగా రష్మిక వ్యక్తిగత ఫోటోలు షేర్ చేసిన సోషల్ మీడియాలో పెద్దగా హాట్ గా ట్రెండ్ అవ్వలేకపోయాయి. ఆమె ప్రధానంగా ధామ సినిమా ప్రమోషన్స్‌కు సంబంధించిన పోస్ట్లు మాత్రమే చేశారు, మిగతా వ్యక్తిగత పోస్టులు అట్రాక్టివ్‌గా హైలైట్ అవలేదు.

ముందు తో పోలిస్తే, రష్మిక ఈసారి కొంచెం సైలెంట్ అయ్యింది.  సాధారణంగా ఏదైనా ఫంక్షన్, ఏదైనా ఈవెంట్ అయినా పరోక్షంగా విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో గడిపిన ఫోటోలు షేర్ చేస్తూ వస్తుంది. సాధారణంగా ఒకే బ్యాక్‌గ్రౌండ్, ఒకే థీమ్‌లో ఫోటోలు బయటపడ్డాయి. కానీ ఈసారి, ఆ విధంగా ఫోటోలు బయటకి రావలేదు. ఈ కారణంగా సోషల్ మీడియాలో రష్మిక నిశ్చితార్థం, ఆమె వ్యక్తిగత ప్రణాళికలపై కొత్త అనుమానాలు వ్యక్తమయ్యాయి. నిజంగా రష్మిక తన ఇష్టానుసారం నిశ్చితార్థం చేసుకుందా? లేదా ఆమెను బలవంతంగా నిశ్చితార్థానికి కూర్చోబెట్టారా? అనే విధంగా జనాలు మాట్లాడుకుంటున్నారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో తన ప్రేమ సంబంధాలపై హింట్లు ఇచ్చే రష్మిక, ఈసారి ఎటువంటి హింట్ ఇవ్వకపోవడం వల్ల కూడా ఈ చర్చలు ప్రారంభమయ్యాయి.

అయితే, రష్మిక ఫ్యాన్స్ మాత్రం పూర్తి నెగటివ్‌గా స్పందిస్తున్నారు. సోషల్ మీడియాలో ఇలా లాజిక్ లేని, వ్యక్తిగత విషయాలపై క్వశ్చన్స్ పెట్టకూడదని ఘాటుగా రియాక్ట్ చేస్తున్నారు.  విజయ్ దేవరకొండకు రష్మిక అంటే ఇష్టం, రష్మికకి విజయ్ అంటే ప్రాణం,  ఇద్దరి పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకోబడ్డది. రష్మిక మందన్నా మరియు విజయ్ దేవరకొండ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. అందువలన అభిమానులు, సోషల్ మీడియా యూజర్స్, వారి వ్యక్తిగత జీవితంపై ఊహలు, అనుమానాలు లేకుండా, రష్మిక-విజయ్ జంటకు పూర్తి గౌరవం చూపడం మంచిదని సూచిస్తున్నారు.





మరింత సమాచారం తెలుసుకోండి: