
ఆయన మాట్లాడుతూ –“ఇప్పటికే నేను ఒక కథ రాస్తున్నాను. అది చాలా హార్ట్ తచింగ్, డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఉంటుంది. త్వరలోనే ఆ కథను నేనే దర్శకత్వం వహించబోతున్నాను,” అని ప్రకటించాడు. రామ్ చెప్పిన ఈ మాటలు వింటూనే అక్కడ ఉన్నవాళ్లు ఆశ్చర్యపోయారు. సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యలు క్షణాల్లోనే వైరల్ అయ్యాయి. యూత్ ఆడియన్స్ నుంచి సినీ ప్రేమికుల వరకు అందరూ “రామ్ డైరెక్టర్ అవుతున్నాడా?” అంటూ చర్చించుకుంటున్నారు. ఇక ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటంటే – రామ్ పోతినేని దర్శకత్వంలో హీరోగా ఎవరు నటించబోతున్నారు? అనే ప్రశ్న. ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈ సినిమాలో హీరోగా సిద్దు జొన్నలగడ్డ కనిపించే అవకాశం ఉందట. యూత్ లవ్ స్టోరీలలో తనకంటూ మార్క్ క్రియేట్ చేసిన సిద్దు జొన్నలగడ్డ ఇప్పుడు రామ్ దర్శకత్వంలో నటిస్తే, అది ఇద్దరికీ ఒక పెద్ద మైలురాయి అవుతుంది అని అభిమానులు అంటున్నారు.
అదే సమయంలో, ఈ సినిమాకి రామ్ ఎంతో కేర్ తీసుకుంటున్నాడట. స్క్రిప్ట్ రాయడంలోనూ, సన్నివేశాల రూపకల్పనలోనూ తన అనుభవాన్ని పూర్తిగా వినియోగించుకుంటున్నాడని సమాచారం. కథ ప్రేమ, ప్యాషన్, కంఫ్లిక్ట్ మిశ్రమంగా ఉండబోతోందని టాక్.రామ్ దర్శకత్వం వహించబోతున్న ప్రాజెక్ట్‌పై ఇప్పుడు టాలీవుడ్ అంతా కన్నేసింది. ఈ కొత్త ప్రయోగం ఎంత వరకు విజయవంతం అవుతుందో చూడాలి . కానీ, ఒక విషయం మాత్రం ఖాయం — హీరో రామ్ పోతినేని ఇప్పుడు దర్శకుడిగా కూడా తనదైన ముద్ర వేయబోతున్నాడు అనదంలో ఏ మాత్రం సందేహం లేదు..!