తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటులలో నారా రోహిత్ ఒకరు. ఈయన చాలా కాలం క్రితమే నటుడి గా సినీ ప్రస్తానాన్ని మొదలు పెట్టారు . నటుడిగా కెరియర్ను మొదలు పెట్టాక ఈయన వరుస పెట్టి సినిమాల్లో నటిస్తూ వచ్చాడు. అందులో కొన్ని సినిమాలు మంచి విజయాలు సాధించడంతో ఈయన కు తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు వచ్చింది. నారా రోహిత్ మంచి జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తున్న సమయం లో ఒక్క సారిగా సినిమాలుకు బ్రేక్ ఇచ్చి ఏకంగా కొన్ని సంవత్సరాల పాటు సినిమాలకు దూరంగా ఉన్నాడు.

మళ్ళీ ప్రస్తుతం వరుస పెట్టి సినిమాల్లో నటిస్తున్నాడు. కొంత కాలం క్రితం ప్రతినిధి 2 అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. నారా రోహిత్ ఆ తర్వాత చాలా తక్కువ కాలం గ్యాప్ లోనే భైరవం , సుందరకాండ అనే సినిమాలతో ప్రేక్షకులను పలకరించారు. భైరవం సినిమా ప్రేక్షకులను నిరుత్సాహ పరచగా సుందరకాండ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇది ఇలా ఉంటే నారా రోహిత్ మరి కొంత కాలం లోనే పెళ్లి చేసుకోబోతున్న విషయం మనకు తెలిసిందే.

కొంత కాలం క్రితమే నారా రోహిత్ కి శిరీష అనే అమ్మాయితో ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. దానితో వీరిద్దరి వివాహం ఎప్పుడు జరుగుతుందా అని ఎంతో మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అక్టోబర్ 30 వ తేదీన వీరిద్దరి వివాహం ఎంతో మంది గెస్టుల మధ్య ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా తాజాగా నారా రోహిత్ పెళ్లి కి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: