నందమూరి నట సింహం బాలకృష్ణ ఇప్పటివరకు తన కెరియర్లో ఎంతో మంది దర్శకులతో పని చేశాడు. కానీ కొంత మంది దర్శకులు మాత్రం బాలకృష్ణ కు అద్భుతంగా కలిసి వచ్చారు. వారితో చేసిన సినిమాలతో సూపర్ సాలిడ్ విజయాలను బాలకృష్ణ అందుకున్నాడు. మరి బాలకృష్ణ కు అంతలా కలిసి వచ్చిన ఆcదర్శకులు ఎవరో తెలుసా ..? ఆ దర్శకులు మరెవరో కాదు బి గోపాల్ , బోయపాటి శ్రీను. బాలకృష్ణ తన కెరీయర్లో బి గోపాల్ దర్శకత్వంలో రూపొందిన ఐదు సినిమాలలో హీరోగా నటించాడు. మొదటగా వీరిద్దరి కాంబోలో లారీ డ్రైవర్ అనే సినిమా వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

ఆ తర్వాత వచ్చిన రౌడీ ఇన్స్పెక్టర్ మూవీ కూడా మంచి విజయం సాధించింది. ఆ తర్వాత వచ్చిన సమర సింహాvరెడ్డి మూవీ టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన నరసింహ నాయుడు సినిమా కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఆఖరిగా వీరిద్దరి కాంబోలో పల్నాటి బ్రహ్మనాయుడు అనే సినిమా వచ్చింది. ఈ సినిమా మాత్రం బాక్సా ఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. మొత్తంగా వీరి కాంబోలో ఐదు సినిమాలు వస్తే అందులో రెండు సినిమాలు సూపర్ హిట్స్ గా నిలవగా , రెండు ఇండస్ట్రీ హిట్లుగా నిలిచాయి. ఒకే ఒక సినిమా ఫ్లాప్ అయ్యింది. ఇక బాలకృష్ణ , బోయపాటి శ్రీను కాంబినేషన్లో మొదటగా సింహ అనే సినిమా వచ్చింది. ఈ సినిమా బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.

ఆ తర్వాత వీరి కాంబోలో వచ్చిన లెజెండ్ మూవీ కూడా బ్లాక్ బస్టర్ అయింది. ఆ తర్వాత వీరి కాంబోలో వచ్చిన అఖండ మూవీ కూడా బ్లాక్ బస్టర్ అయింది. ప్రస్తుతం వీరికి కాంబో లో అఖండ 2 అనే మూవీ రూపొందుతుంది. ఈ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇలా బాలకృష్ణకు చాలా మంది దర్శకులు మంచి విజయాలను అందించారు. వారిలో బి గోపాల్ , బోయపాటి శ్రీను ఇద్దరు మాత్రం చాలా విజయాలను బాలయ్య కు అందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: