సినిమా ఇండస్ట్రీ లో ఒకరితో చేయాలి అనుకున్న పాత్రను మరొకరితో చేయించడం చాలా సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఒకరితో ఒక సినిమాలోని పాత్రను అనుకొని ఆ తర్వాత వారిని సంప్రదించి వారు గనక ఆ పాత్రను రిజెక్ట్ చేసినట్లయితే ఆ సినిమా విడుదల అయ్యి ఆ మూవీ ఫ్లాప్ అయినా ఆ మూవీ లోని ఆ పాత్రకు మంచు గుర్తింపు రాకపోయినా ఆ సినిమాలో ఆ పాత్రను రిజక్ట్ చేసినందుకు నటీ నటులు ఎంతో ఆనంద పడుతూ ఉంటారు.

ఇది ఇలా ఉంటే ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపు కలిగిన నటీ మణులలో కియార అద్వానీ ఒకరు. ఈమె హిందీ సినిమాల ద్వారా కెరియర్ను మొదలు పెట్టి బాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత పలు తెలుగు సినిమాలలో కూడా నటించింది. ఈమె ఇప్పటివరకు తెలుగు లో భరత్ అనే నేను , వినయ విధేయ రామ , గేమ్ చెంజర్ అనే మూడు సినిమాలలో నటించింది. ఈ మూడు సినిమాల ద్వారా ఈమె తెలుగు సినీ పరిశ్రమలో కూడా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈమె ఒక ప్లాప్ సినిమాలో అవకాశాన్ని కోల్పోయినందుకు తెగ బాధపడుతున్నట్లు తెలుస్తోంది.

అసలు విషయం లోకి వెళితే ... కొంత కాలం క్రితం ఆమీర్ ఖాన్ "లాల్ సింగ్ చేద్దా" అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ బృందం వారు ఈ సినిమాలో హీరో ఎవరు అనేది చెప్పకుండా ఈ మూవీ యొక్క ఆడిషన్స్ ను నిర్వహించారట. కియారా కూడా ఆ ఆడిషన్స్ లో పాల్గొందట. కానీ ఈమె అందులో సెలెక్ట్ కాలేదట. ఆ ఆడిషన్స్ లో కరీనా కపూర్ కూడా పాల్గొందట. ఆమెను హీరోయిన్గా సెలెక్ట్ చేశారట. ఇక ఆ తర్వాత ఆ మూవీలో కరీనా కపూర్ ను హీరోయిన్గా సెలెక్ట్ చేశారు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత అది అమీర్ ఖాన్ హీరోగా నటించిన సినిమా అని తెలిసి అందులో ఆఫర్ రానందుకు కియార చాలా ఫీల్ అవుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: