హీరో బాలకృష్ణ , డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం అఖండ 2. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే వీరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకోవడమే కాకుండా బాలయ్య కెరీర్ కి ప్లస్ గా మారింది. అఖండ 2 సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. వీరి కాంబినేషన్లో 2021లో వచ్చిన అఖండ మూవీ మంచి విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు రెండో భాగం తెరకెక్కించారు. అఖండ 2 కి సంబంధించి టీజర్ ని విడుదల చేయగా భారీ అంచనాలుపెరిగిపోయాయి. తాజాగా తాండవం అనే సాంగ్ ప్రోమో అని కూడా మేకర్స్ విడుదల చేశారు.



ఈ ప్రోమోలో చూస్తూ ఉంటే బాలయ్య మాస్ ఎనర్జీతో స్క్రీన్ పైన అదరగొట్టేలా కనిపిస్తున్నట్లు చాలా క్లియర్ గా కనిపిస్తోంది. బాలయ్య అఘోర గెటప్ లో తన నటనతో పీక్స్ లో తీసుకువెళ్లారని చెప్పవచ్చు. బాలయ్య ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా హైలెట్ గా ఉన్నాయి. తన బాడీ లాంగ్వేజ్ ని కూడా అలాగే మైంటైన్ చేస్తూ.. తాండవం చూపించారంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మ్యూజిక్, విజువల్, లిరిక్స్ అన్నీ కూడా ఈ సాంగ్ ను చాలా హైలెట్ చేశాయి. ఫుల్ సాంగ్ నవంబర్ 14వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు. థమన్ అందించిన బిజిఎం  హైలైట్ గా నిలిచింది.


ప్రముఖ నిర్మాణ సంస్థలలో ఒకటైన 14 వీల్స్ ప్లస్ ఈ సినిమాని నిర్మిస్తోంది. డిసెంబర్ 5వ తేదీన పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా అన్ని భాషలలో ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి మరి. ఈ ఏడాది వచ్చిన డాకుమహారాజ్ సినిమా కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అలాగే జైలర్ 2 సినిమాలో కూడా బాలకృష్ణ కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు వినిపిస్తున్న ఇందుకు సంబంధించి అఫీషియల్ గా మాత్రం అనౌన్స్మెంట్ అయితే రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: