కుంభా అనే పేరు వెనుక ఇప్పుడు వినిపిస్తున్న సెన్సేషనల్ థియరీ చూస్తే.. ఈ పాత్ర ఎంత ప్రత్యేకంగా ఉండబోతుందో అర్థమవుతోంది! రాజమౌళి తన విలన్ పాత్రకు కుంభా అని పేరు పెట్టడానికి ప్రత్యేక కారణమే ఉంది. రామాయణంలో ఎంతో ప్రాధాన్యమున్న పాత్రల్లో ఒకటైన కుంభకర్ణుడి పాత్ర స్ఫూర్తితో దీనిని తీర్చిదిద్దినట్లు చెబుతున్నారు. ఆరు నెలలు నిద్రపోయి, ఆరు నెలలు మేల్కొని ఉండే కుంభకర్ణుడి పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది. రావణాసురుడితో యుద్ధానికి ముందు రాముడికి కుంభకర్ణుడు ఎంతటి సవాలుగా నిలిచాడో అందరికీ తెలిసిందే. ఈ రామాయణ రెఫరెన్స్‌కు పృథ్వీరాజ్ లుక్‌కు లింకు ఉంది. కుంభకర్ణుడి చేతులను, కాళ్లను రాముడు నరికినట్లు పురాణాల్లో ఉంది.
ఇప్పుడు పృథ్వీరాజ్ ఫస్ట్ లుక్‌ను గమనిస్తే.. అతను చేతులు, కాళ్లు చచ్చుబడిపోయి చక్రాల కుర్చీకి పరిమితమైనట్లుగా చూపించారు. ఈ పాత్రకు 'కుంభా' అనే పేరు పెట్టడం, ఈ లుక్ ఇవ్వడం వెనుక కుంభకర్ణుడి క్యారెక్టరే స్ఫూర్తి అని అర్థమవుతోంది! 'వారణాసి' కథకు రామాయణంతో లింకు ఉందని, మహేష్ బాబు ఇందులో రాముడిగా కనిపిస్తారని రాజమౌళి స్వయంగా వెల్లడించారు. కాబట్టి, పృథ్వీరాజ్ పాత్ర రామాయణంలోని కుంభకర్ణుడి క్యారెక్టరే అని భావించవచ్చు. ఈ పాత్ర సాధారణంగా కనిపించినా.. దాని వెనుక ఉన్న పవర్, బ్యాక్ స్టోరీ ఎంతటి మాస్ ఎలివేషన్ ఇస్తుందో రాజమౌళికే తెలుసు. త్వరలోనే కుంభా పాత్రలోని అసలు పవర్‌ను రాజమౌళి రివీల్ చేయబోతున్నారని.. అప్పుడు సోషల్ మీడియా రచ్చ వేరే లెవెల్‌లో ఉంటుందని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి