అల్లు అర్జున్ ఇటీవల చేసిన పుష్ప సిరీస్ ఎంతటి సంచలన విజయాన్ని సాధించిందో అందరికీ తెలుసు. ఆ ప్రభావం, ఆ క్రేజ్ ఇప్పటికీ అన్ని భాషల్లో కూడా దుమ్మురేపుతూనే ఉంది. ఇలాంటి సమయంలో అట్లీ వంటి మాస్ కమర్షియల్ డైరెక్టర్‌తో అల్లు అర్జున్ కలిసి పని చేయడం అనేది ఇండస్ట్రీ మొత్తం దృష్టిని ఈ ప్రాజెక్ట్ వైపుకు మళ్లించే అంశంగా మారింది. ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ దీపిక పదుకొనే ను హీరోయిన్ గా తీసుకున్నారు. ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న మాట ప్రకారం—ఈ సినిమా విడుదలైన తర్వాత అల్లు అర్జున్ కెరీర్ పూర్తిగా మరో స్థాయికి ఎగబాకుతాడని, అదే సమయంలో అట్లీ కూడా “ఇదిగో ఇదే నేను” అన్నట్టుగా, ఎవరూ చేరుకోలేని స్థాయికి ఎదగబోతున్నాడని టాక్ నడుస్తోంది.
మాస్, యాక్షన్, ఎమోషన్—అన్ని ప్యాకేజ్‌గా రూపొందుతున్న ఈ చిత్రంపై ఇండస్ట్రీలో మాత్రమే కాదు, ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రతి చిన్న అప్డేట్‌కి దేశవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ రెస్పాన్స్ చూస్తే, ఇది నిజమైన ‘మాన్‌స్టర్ ప్రాజెక్ట్’ అవుతుందని ఇప్పటినుంచే స్పష్టంగా కనిపిస్తోంది. వారణాసి సినిమా ఈవెంట్ లో జరిగిన తప్పులను అట్లీ గమనించి తన సినిమా విషయంలో ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటున్నారట. చూడాలి మరి అట్లీ ప్లాన్ ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుంది అనేది..??
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి