ప్రస్తుతం ఈ డైరెక్టర్ పేరు తెగ మార్మోగిపోతుంది.దానికి కారణం ఓ హీరోయిన్ తో ప్రేమలో ఉన్నట్టు రూమర్లు రావడమే. ఎక్కడ చూసినా కూడా ఈ జంట ఎక్కువగా క్లోజ్ గా కనిపించడంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే రూమర్లు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ఈ డైరెక్టర్ పెళ్లయినప్పటికీ ప్రేమలో ఉన్నానని చెప్పి తనది గ్రేటెస్ట్ లవ్ అంటూ చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు.ఇక ఆ డైరెక్టర్ ఎవరో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. ఆయనే పెళ్లి చూపులు ఫేమ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్..దర్శకుడిగా ఎంతో మందు యూత్ మెచ్చే సినిమాలు తీసిన తరుణ్ భాస్కర్ పెళ్లిచూపులు మూవీతో నేషనల్ అవార్డు అందుకున్నారు. అలాగే ఈయన తీసిన ఈ నగరానికి ఏమైంది సినిమా కూడా చాలామందికి ఫేవరెట్.అయితే అలా హిట్ సినిమాలు తీసిన డైరెక్టర్ గా మాత్రమే కాకుండా సినిమాల్లో కీ రోల్స్ పోషిస్తూ తరుణ్ భాస్కర్ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు.

 అలా ప్రస్తుతం ఈయన హీరోగా ఈషారెబ్బా హీరోయిన్గా ఓం శాంతి శాంతి శాంతిః అనే సినిమా కూడా తెరకెక్కుతోంది.ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తరుణ్ భాస్కర్ ని యాంకర్ షాకింగ్ ప్రశ్న అడిగింది.మీకు తెలిసిన వారిలో అంటే మీ ఫ్యామిలీలో లేదా మీ స్నేహితుల్లో ఎవరిది గొప్ప ప్రేమ అని మీ భావన అని ప్రశ్నించగా..అందరిలో నాదే గ్రేటెస్ట్ లవ్ అంటూ చెప్పి షాక్ ఇచ్చారు తరుణ్ భాస్కర్. అంటే తరుణ్ భాస్కర్ చెప్పిన మాటలను బట్టి చూస్తే ఆయన గురించి ఈ మధ్యకాలంలో వస్తున్న రూమర్లు నిజమే అనుకోవచ్చు.

ఎందుకంటే గత కొద్ది రోజులుగా తరుణ్ భాస్కర్ ఈషా రెబ్బా ఇద్దరు ప్రేమలో ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. తరుణ్ భాస్కర్ తన భార్య లతకు విడాకులు ఇచ్చి ఈషా రెబ్బాని రెండో పెళ్లి చేసుకోబోతున్నారనే రూమర్లకు తాజా ఇంటర్వ్యూ తో మరోసారి క్లారిటీ వచ్చింది. అంతేకాదు ఇదే ఇంటర్వ్యూలో యాంకర్ మీరు ఎవరితో ప్రేమలో ఉన్నారో నాకు తెలుసులే.కానీ ఆమె పేరు మాత్రం ఇప్పుడు చెప్పను అంటూ నవ్వేసరికి ఇది కాస్త వైరల్ గా మారింది. దాంతో తరుణ్ భాస్కర్ తన ప్రేమ విషయాన్ని త్వరలోనే అఫీషియల్ గా బయట పెట్టబోతున్నారు కావచ్చు. అందుకే ఈ విధంగా హింట్స్ ఇస్తున్నారు అంటూ కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. మరి చూడాలి తరుణ్ భాస్కర్ నిజంగానే తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చేసి ఈషా రెబ్బాని పెళ్లి చేసుకుంటారా అనేది.

మరింత సమాచారం తెలుసుకోండి: