నవంబర్ 28వ తేదీన హైదరాబాదులో ఈ ఈవెంట్‌ను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు టీమ్ ప్లాన్ చేసినట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా, ఈ కార్యక్రమానికి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్‌గా హాజరుకానున్నారని ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి కూడా ఈ ఈవెంట్‌కు వస్తారని సోషల్ మీడియాలో ఒక వార్త తీవ్రమైన చర్చనీయాంశంగా మారింది. ఈ రెండు పేర్లు రావడంతో ప్రీ-రిలీజ్ వేడుకపై హైప్ మరింత పెరిగిపోయింది.
ఇదిలా ఉంటే, బాలయ్య తదుపరి చిత్రం గురించి కూడా కొత్త అప్డేట్లు వరుసగా బయటకు వస్తున్నాయి. గోపీచంద్ మల్లినేని దర్శకత్వంలో బాలకృష్ణ నటించబోతున్న ప్రాజెక్టుపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో లేడీ సూపర్‌స్టార్ నయనతారను హీరోయిన్‌గా ఫిక్స్ చేశారు. మరో హీరోయిన్ గా శ్రీనిధి ని సెలక్ట్ చేసిన్నట్లు విశ్వసనీయ సమాచారం తెలుస్తోంది. అయితే, నయనతారను ఈ సినిమాలోకి తీసుకోవడం అంత సులభం కాలేదట. ఆమెను ఒప్పించే విషయంలో దర్శకుడు గోపీచంద్ మల్లినేని బాగా కష్టాలు పడ్డారట. ఆమె కండీషన్స్ చూసి డైరెక్టర్ భయపడిపోయారట. చివరకు బాలయ్య స్వయంగా రంగంలోకి దిగడంతో, ఆయన మాటకు గౌరవం ఇచ్చిన నయనతార ఈ ప్రాజెక్ట్‌ను అంగీకరించినట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. బాలయ్య ఒక్క ఫోన్ చేయడంతో పని అయ్యిందన్న కథనం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో బాలయ్య–గోపీచంద్–నయనతార కాంబినేషన్‌పై క్రేజ్ మరింతగా పెరిగిపోయింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి