అయితే ఈ రూమర్లపై రాజ్ నిడమూరు లేదా సమంత ఎవరూ అధికారికంగా స్పందించలేదు. అందుకే అభిమానుల్లో అనుమానాలు, చర్చలు మరింత పెరుగుతున్నాయి. ‘‘ఇద్దరూ నిజంగా ప్రేమలో ఉన్నారా?’’, ‘‘ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు?’’ అనే ప్రశ్నలు నెట్టింట పెద్ద చర్చగా మారాయి. అధికారిక సమాచారం ఏదీ లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది.ఇంతలో మరో సంచలన రూమర్ బయటకు వచ్చింది. రష్మిక మందన్నా – విజయ్ దేవరకొండ పెళ్లి మూహుర్తం నాడే సమంత – రాజ్ నిడమూరు అంటే ఫిబ్రవరి 26న సింపుల్ గా చర్చ్ లో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త హడావుడి చేస్తోంది. కుటుంబ సభ్యుల మధ్య, చర్చి వద్ద, చాలా సింపుల్‌గా వివాహం జరగనుందని అనేక సోషల్ మీడియా పేజీలు చెబుతున్నాయి.
ఈ సమాచారం ఎంత వరకు నిజం అన్నది మాత్రం ఇంకా స్పష్టత లేదు. అధికారిక ప్రకటన రాకపోయినా, ఈ వార్తలు నిమిష నిమిషానికి వైరల్ అవుతూనే ఉన్నాయి. అభిమానులు కూడా, ‘‘ఈ వార్తలు పుకార్లలా పాకడం కంటే, సమంత లేదా దర్శకుడు రాజ్ నిడమూరు ముందే స్పందిస్తే మంచిది’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియా ఊహాగానాల కారణంగా, ఈ విషయం మరింత పెద్దదై ట్రెండ్ అవుతుండడంతో, చాలా మంది నిజం ఏంటి అని తెలుసుకోవాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చూడాలి మరి దీని పై సమంత ఎలా స్పందిస్తుందో..???
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి