ఇప్పటికే మనందరికీ తెలిసిందే, త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించబోతున్న ఈ కొత్త ప్రాజెక్ట్‌లో వెంకటేష్ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు. షూటింగ్ విషయానికి వస్తే, అన్ని పనులు సక్రమంగా పూర్తయితే డిసెంబర్ 15 తరువాత ఈ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి రావచ్చని అంచనా. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ–ప్రొడక్షన్ వర్క్ కూడా వేగంగా జరుగుతున్నట్టు సమాచారం. హీరోయిన్గా ప్రముఖ నటి శ్రీనిధి ఫిక్స్ అయ్యారనే బలం ఉన్న రూమర్లు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.
అయితే ఈ సినిమా ఏ జానర్‌లో రూపొందుతుందో అన్నదే ఇప్పుడు హాట్ చర్చ. అందుతున్న ఇన్‌సైడ్ టాక్ ప్రకారం— ఇది పూర్తిగా ఫుల్‌టు ఫ్యామిలీ ఎంటర్టైనర్. అంటే త్రివిక్రమ్ ట్రేడ్ మార్క్ కామెడీ, ఫ్యామిలీ డ్రామా, ఎమోషన్స్—అన్ని కలసిన సినిమాఇంకా ఒక కీలక విషయం ఏమిటంటే…ఈ సినిమాలో ఫైట్ సీన్స్ ఉండవనే ప్రచారం జోరందుకుంది. త్రివిక్రమ్ సినిమాల్లో సాధారణంగా సింపుల్ యాక్షన్ ఎలిమెంట్స్ ఉండొచ్చు. కానీ ఇక్కడ మాత్రం ఫ్యామిలీ ఎమోషన్స్‌పైనే పూర్తి ఆధారపడేలా కథ నడుస్తుందని టాక్ వినిపిస్తోంది. మరొక ఇంట్రెస్టింగ్ పాయింట్ —సాధారణంగా త్రివిక్రమ్ సినిమాల్లో ఒక్కటి–రెండు రొమాంటిక్ సీన్స్ ఉంటాయి. అవి కూడా చాలా క్లాస్‌గా, సాఫ్ట్‌గా డిజైన్ చేస్తారు. కానీ ఈసారి ఆ భాగాన్నే పూర్తిగా పక్కన పెట్టినట్టు అనిపిస్తోంది. ఈ సినిమాలో రొమాంటిక్ ట్రాక్ లేదా స్లో–బర్న్ నాటి సీన్స్ కూడా ఉండబోవని సమాచారం. డైరెక్టర్ ఈసారి పూర్తిగా ఫ్యామిలీ, బంధాలు, సంబంధాలు, భావోద్వేగాలు అనే అంశాలకే ప్రాధాన్యం ఇచ్చాడని ఇండస్ట్రీ టాక్.
ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో చర్చలు, మీమ్స్, అప్రిసియేషన్స్ ఇలా విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్ సంతోషపడుతున్నా, కొందరు మాత్రం— “త్రివిక్రమ్ మార్క్ లేని సినిమా ఎలా ఉంటుంది?”
“రోమాంటిక్ ఎలిమెంట్స్ లేకుండా డ్రై అవుతుందేమో?” అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి