సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండేవారు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తూ ఉంటారు. ఇండస్ట్రీలో మంచి పాపులారిటీ సంపాదించుకొని ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, కేంద్ర మంత్రులు అయిన వారు ఎంతో మంది ఉన్నారు. అలాగే ముఖ్యమంత్రి పీఠాలను కూడా అధిరోహించారు. అలా తెలుగు సినిమా చరిత్రలో మంచి గుర్తింపు పొంది కేవలం 9 నెలల్లోనే  సీఎం అయిన వ్యక్తుల్లో  సీనియర్ ఎన్టీఆర్ ముఖ్యులు.. ఈయన సీఎం అయిన తర్వాత ఇండస్ట్రీ చరిత్రనే కాకుండా రాష్ట్ర రాజకీయ పరిస్థితులను కూడా మార్చేశారు. ఈయనే కాకుండా ప్రస్తుతం  పవన్ కళ్యాణ్, బాలకృష్ణ కూడా రాజకీయాల్లో రాణిస్తున్నారు.. 

ఇదంతా పక్కన పెడితే రాబోవు రోజుల్లో ఆ హీరోకు మాత్రం సీఎం అయ్యే యోగం ఉందని ఓ నిర్మాత చెప్పిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఆ హీరో ఎవరు.. ఆ వివరాలు చూద్దాం.. ప్రముఖ ప్రొడ్యూసర్ చంటి అడ్డాల  కొన్ని సంవత్సరాల క్రితమే టాలీవుడ్ స్టార్ హీరో జాతకాన్ని జ్యోతిష్యుడికి చూపించారట. ఆ సమయంలో ఆ జ్యోతిష్యుడు ఈయనకు సీఎం అయ్యే యోగం ఉంది.. మంచి బలమైన జాతకుడు అని చెప్పారట. అలాగే సినిమాల్లో కూడా బాగా రాణిస్తారని తెలియజేశారట. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరయ్యా అంటే  జూనియర్ ఎన్టీఆర్.  జూనియర్ ఎన్టీఆర్ తో మొదటిసారి అల్లరి రాముడు సినిమాను చేసాం.

అనుకున్నంత స్థాయిలో సినిమా మెప్పించలేకపోయినా కానీ నష్టమైతే జరగలేదు.  అలా జూనియర్ ఎన్టీఆర్ తో మా బాండింగ్ కుదిరింది అంటూ చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తారు అనేది తెలియదు కానీ ఒకవేళ పూర్తిస్థాయిలో ఎంట్రీ ఇస్తే మాత్రం ఆయనకు సీఎం అయ్యే యోగం ఉందని చెప్పుకొచ్చారు. అలా నిర్మాత చంటి అడ్డాల ఈ విషయం గతంలో బయటపెట్టడంతో  మరోసారి ఆ పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.ఎన్టీఆర్ అభిమానులు సీఎం సీఎం అంటూ కామెంట్లతో ముంచేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: