- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

మాస్ హీరో నందమూరి బాలకృష్ణ , దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే బాక్సాఫీస్ దగ్గర ప్రకంపనలు సృష్టించడం ఖాయం. వీరి తాజా చిత్రం అఖండ 2 కూడా అదే పంథాను కొనసాగిస్తూ మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా, తొలి వారాంతంలోనే డీసెంట్ కలెక్షన్లను సాధించింది. ట్రేడ్ వర్గాల నుంచి అందిన తాజా సమాచారం ప్రకారం, 'అఖండ 2' శనివారం నైజాం ఏరియాలో అద్భుతంగా పెర్పామ్ చేసింది. రు. 3.30 కోట్ల (జీఎస్‌టీ మినహాయించి) షేర్‌ను రాబట్టింది. దీంతో ఈ సినిమా రెండు రోజుల మొత్తం షేర్ రు. 9.5 కోట్లకు చేరింది. నైజాంలో ఈ సినిమాను పంపిణీ చేసిన‌ అగ్ర నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ, 'అఖండ 2' ఇప్పటికే రు. 10 కోట్ల క్లబ్‌లోకి ప్రవేశించిందని, ఈ సినిమా తన పెట్టుబడిలో డెబ్బై శాతానికి పైగా వసూలు చేసిందని వెల్లడించారు. సినిమా త్వరలోనే లాభాల జోన్‌లోకి ప్రవేశిస్తుందని కూడా ఆయన ధీమా వ్యక్తం చేశారు.


అఖండ 2 - తాండ‌వం మూడు రోజుల థియేట్రికల్ జర్నీలో , ' అఖండ 2 ' రు. 55 కోట్లకు పైగా షేర్‌ను వసూలు చేసి, బాలయ్య - బోయపాటి కాంబోకి ఉన్న క్రేజ్‌ను మరోసారి నిరూపించింది. ఈ సీక్వెల్‌లో సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి, హర్షాలీ మల్హోత్రా వంటి నటీనటులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించగా, తమన్ ఎస్‌.ఎస్‌. సంగీతం అందించారు. ఇక బాల‌య్య - బోయ‌పాటి కాంబినేష‌న్ లో నాలుగో హిట్ సినిమా గా అఖండ 2 నిలిచింది. గ‌తంలో వీరి కాంబో లో వ‌చ్చిన సింహా - లెజెండ్ - అఖండ మూడు సినిమాలు ఒక దానిని మించి మ‌రొక‌టి సూప‌ర్ హిట్ అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: