మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ హిట్ చిత్రం “దేవర” గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన వెంటనే భారీ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఎన్టీఆర్ కెరీర్‌లోనే సోలో హీరోగా అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా “దేవర” రికార్డు సృష్టించింది. దీంతో ఈ సినిమా సీక్వెల్ అయిన “దేవర పార్ట్ 2” పై అభిమానుల్లో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.దేవర పార్ట్ 2 గురించి గత కొంతకాలంగా అనేక రకాల రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సీక్వెల్‌కు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. తాజా సమాచారం ప్రకారం, జూనియర్ ఎన్టీఆర్‌కు ఇటీవలే దర్శకుడు కొరటాల శివ తన టీంతో కలిసి దేవర 2 కి సంబంధించిన కొత్త వెర్షన్‌ను వినిపించినట్టు టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

ముఖ్యంగా దేవర పార్ట్ 1 విషయంలో ప్రేక్షకుల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను కొరటాల శివ సీరియస్‌గా తీసుకున్నారని తెలుస్తోంది. మొదటి భాగం విడుదలైన తర్వాత సినిమా సెకండాఫ్‌పై కొన్ని విమర్శలు వచ్చాయి. ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని, దేవర 2 కోసం కథను మరింత బలంగా మలిచినట్టు సమాచారం. పార్ట్ 1లో కొంతమందికి వీక్‌గా అనిపించిన ఎలిమెంట్స్‌ను పూర్తిగా మార్చి, ఈసారి స్ట్రాంగ్ సెకండాఫ్‌తో కథను డిజైన్ చేశారని ఇండస్ట్రీలో వినిపిస్తోంది.కొరటాల శివ తన టీంతో కలిసి దేవర 2 కోసం ఒక పవర్‌ఫుల్ న్యారేషన్‌ను సిద్ధం చేసినట్టు, అది ఎన్టీఆర్‌కు వినిపించారట. అయితే ఈ కథపై జూనియర్ ఎన్టీఆర్ తుది నిర్ణయం ఏంటి? ఆయన నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తుందా లేదా? అన్నది ఇంకా అధికారికంగా బయటకు రావాల్సి ఉంది. ఈ విషయంలో ఎన్టీఆర్ రియాక్షన్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు యువసుధ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.మొత్తానికి దేవర పార్ట్ 2 పై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. అధికారిక ప్రకటన వచ్చేదాకా అభిమానుల ఎదురుచూపులు మాత్రం ఆగేలా కనిపించడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: