జపాన్‌లో ఈ సినిమాను 'పుష్ప కున్రిన్' (Pushpa Kunrin) అనే టైటిల్‌తో విడుదల చేస్తున్నారు. గీక్ పిక్చర్స్ మరియు షోచికు స్టూడియోస్ సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని జపాన్ మార్కెట్‌లోకి తీసుకెళ్తున్నాయి. ఇప్పటికే విడుదలైన జపనీస్ ట్రైలర్‌లో బన్నీ చెప్పిన జపనీస్ డైలాగులు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. ముఖ్యంగా సినిమాలో జపాన్ నేపథ్యం ఉన్న ఫైట్ సీక్వెన్స్ మరియు బన్నీ జపనీస్‌లో మాట్లాడే సీన్స్ అక్కడి ప్రేక్షకులకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.గతంలో 'RRR' చిత్రం జపాన్ బాక్సాఫీస్ వద్ద ₹150 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఇప్పుడు ఆ రికార్డును బద్దలు కొట్టడమే లక్ష్యంగా 'పుష్ప 2' ఏకంగా 250కి పైగా థియేటర్లలో విడుదల కాబోతోంది. మరో విశేషమేమిటంటే, ఇండియాలో విడుదలైన వెర్షన్ కంటే అదనంగా 20 నిమిషాల సీన్లను జోడించి, మొత్తం 222 నిమిషాల ఎక్స్‌టెండెడ్ కట్ ను జపాన్ ప్రేక్షకులకు చూపిస్తున్నారు. జనవరి 15న గ్రాండ్ ప్రీమియర్స్ నిర్వహించనున్నారు.
అల్లు అర్జున్ టోక్యో చేరుకోవడంతో అక్కడి ప్రమోషన్లు పీక్స్‌కు చేరుకున్నాయి. ప్రెస్ మీట్లు, స్పెషల్ ఇంటర్వ్యూల ద్వారా జపాన్ ఆడియన్స్‌ను పలకరించబోతున్నారు. పుష్పరాజ్ రాగ్డ్ లుక్, దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్, సుకుమార్ మేకింగ్ జపనీయులకు కొత్త అనుభూతిని ఇస్తాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమా జపాన్‌లో కూడా ₹100 కోట్ల క్లబ్‌లో చేరితే, అల్లు అర్జున్ గ్లోబల్ స్టార్‌డమ్ మరో స్థాయికి వెళ్తుంది.సింధూరం పెట్టుకుని, గొడ్డలి పట్టి, తగ్గేదే లే అని ఎర్రచందనం స్మగ్లర్‌గా అదరగొట్టిన మన బన్నీ, ఇప్పుడు జపాన్ గడ్డపై తన సత్తా చాటబోతున్నారు. టోక్యో వీధుల్లో ఐకాన్ స్టార్ హంగామా చూస్తుంటే, 'పుష్ప 2' అక్కడ కూడా సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి