నందమూరి అభిమానులకు అసలైన పండుగ వచ్చేసింది! 'గాడ్ ఆఫ్ మాసెస్' నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ అంటేనే ఒక విధ్వంసం. 'వీరసింహారెడ్డి'తో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన ఈ క్రేజీ జోడీ, ఇప్పుడు NBK 111 కోసం మళ్ళీ చేతులు కలిపారు. ఈ భారీ ప్రాజెక్ట్ రేపు, అంటే మార్చి 5, 2026 నుంచి హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రారంభం కాబోతోంది.


గోపీచంద్ మలినేని ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులన్నీ కంప్లీట్ చేసి, బాలయ్యను మరో లెవెల్ పవర్‌ఫుల్ మాస్ రోల్‌లో చూపించేందుకు స్కెచ్ వేశారు. రేపు ఉదయం హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ఈ సినిమా పట్టాలెక్కనుంది.రామ్ చరణ్ 'పెద్ది' చిత్ర నిర్మాత వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. బాలయ్య కెరీర్‌లోనే ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా నిలవనుంది.



ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ నగర్‌లో హాట్ టాపిక్ ఏదైనా ఉందంటే.. అది ఈ సినిమాలో మంచు మనోజ్ పాత్ర గురించే!గతంలో 'ఊ కొడతారా ఉలిక్కిపడతారా' చిత్రంలో వీరిద్దరి కాంబినేషన్ అదిరిపోయింది. ఇప్పుడు పదేళ్ల తర్వాత మళ్ళీ బాలయ్య సినిమాలో ఒక కీలక పాత్ర కోసం మనోజ్‌ను సంప్రదించారట.బాలయ్యతో మనోజ్‌కు ఉన్న సాన్నిహిత్యం గురించి అందరికీ తెలిసిందే. మనోజ్ ఈ ఆఫర్‌కు ఓకే చెబితే, వెండితెరపై నందమూరి-మంచు వారి కాంబినేషన్‌లో మరో మాస్ జాతర చూడటం ఖాయం.



ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటిస్తుండటం మరో విశేషం. బాలయ్య-నయన్ కాంబో అంటే గతంలో 'సింహా', 'శ్రీరామరాజ్యం', 'జై సింహా' వంటి హిట్స్ ఉన్నాయి. సెంటిమెంట్ పరంగా కూడా ఇది ప్లస్ అవ్వనుంది.'వీరసింహారెడ్డి'కి థంపింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన ఎస్.ఎస్. థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. బాలయ్య మార్క్ ఎలివేషన్లకు థమన్ ఇచ్చే మ్యూజిక్ ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోవచ్చు.2026 దసరా కానుకగా ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. బాలయ్యకు దసరా సీజన్ ఎప్పుడూ బాగా కలిసి వస్తుంది, కాబట్టి బాక్సాఫీస్ దగ్గర మరో సునామీ గ్యారంటీ!


మరింత సమాచారం తెలుసుకోండి: