ఈ జంట ప్రస్తుతం ఒక ప్రైవేట్ వెకేషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. సముద్రపు ఒడ్డున, బికినీ డ్రెస్‌లో ప్రియాంక మెరిసిపోతుంటే, ఆమె పక్కనే నిక్ జోనాస్ చాలా కూల్‌గా కనిపిస్తున్నారు. వీరిద్దరి మధ్య ఉన్న బాండింగ్ చూస్తుంటే, పెళ్లై ఇన్నేళ్లవుతున్నా వీరి ప్రేమ ఇంకా కొత్తగానే ఉందనే విషయం అర్థమవుతోంది. ముఖ్యంగా వీరిద్దరి ఫోటోల్లో కనిపించే కెమిస్ట్రీ హాలీవుడ్ సినిమాల్లోని సీన్లను తలపిస్తోంది.ఒకవైపు పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేస్తూనే, మరోవైపు సినిమాల్లో ప్రియాంక బిజీగా ఉంది. ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న 'వారణాసి' చిత్రంలో ప్రియాంక 'మందాకిని' అనే పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాలో ఆమె గన్ పట్టుకుని చేసే యాక్షన్ సీక్వెన్స్ ఇండియన్ స్క్రీన్ పై మునుపెన్నడూ చూడని విధంగా ఉంటాయని టాక్. జక్కన్న తన మార్క్ విజువల్స్ లో ప్రియాంకను ఒక యోధురాలిగా చూపించబోతున్నారు.
ప్రియాంక చోప్రా మరియు నిక్ జోనాస్ కేవలం ఫోటోలకే పరిమితం కాకుండా, గ్లోబల్ లెవల్ లో చాలా మందికి ఇన్సిపిరేషన్ గా నిలుస్తున్నారు. భిన్న సంస్కృతులు, వేర్వేరు దేశాలకు చెందిన వారైనా.. ప్రేమతో ఎలా ఒకటిగా ఉండాలో ఈ జంట నిరూపిస్తోంది. అందుకే వీరు ఎక్కడికి వెళ్లినా, ఏ చిన్న ఫోటో షేర్ చేసినా అది క్షణాల్లో వరల్డ్ వైడ్ ట్రెండింగ్ లోకి వెళ్తుంది.మొత్తానికి ప్రియాంక చోప్రా-నిక్ జోనాస్ వైరల్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారాయి. ఒకవైపు తన అందంతో నెటిజన్లను మైమరపిస్తూనే, మరోవైపు రాజమౌళి సినిమాతో బాక్సాఫీస్ ను షేక్ చేయడానికి ప్రియాంక సిద్ధమవుతోంది. ఆ 'వారణాసి' యుద్ధం మొదలయ్యేలోపు, ఈ రొమాంటిక్ ఫోటోలతో ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి