టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన దర్శకులలో అనిల్ రావిపూడి ఒకరు. ఈయన ఇప్పటి వరకు చాలా సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఈయన దర్శకత్వం వహించిన ప్రతి సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం సాధించింది. ఇకపోతే అనిల్ రావిపూడి కొంత కాలం క్రితం విక్టరీ వెంకటేష్ హీరో గా ఐశ్వర్య రాజేష్ , మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా సంక్రాంతిగా వస్తున్నాం అనే సినిమాను రూపొందించాడు. ఈ సినిమాను పోయిన సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేశారు.

మూవీ అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే తాజాగా అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవి హీరో గా నయనతార హీరోయిన్గా మన శంకర వర ప్రసాద్ గారు అనే సినిమాను రూపొందించాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన విడుదల చేశారు. ఈ మూవీ కి కూడా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. దానితో ఈ సినిమా కూడా ప్రస్తుతం అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేస్తుంది. కానీ రెండవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల కలెక్షన్ల విషయంలో సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో పోలిస్తే మన శంకర వర ప్రసాద్ గారు సినిమా చాలా వెనకబడిపోయి ఉంది.

రెండవ రోజు సంక్రాంతికి వస్తున్నాం సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 14.24 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేస్తే రెండవ రోజు మన శంకర వర ప్రసాద్ మూవీ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 12.40 కోట్ల షేర్ కలక్షన్లు వసూలు చేసింది. ఇకపోతే మన శంకర వర ప్రసాద్ గారు మూవీ టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఏ స్థాయి కలెక్షన్లను వసూలు చేసి ఏ రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంటుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: