టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి విక్టరీ వెంకటేష్ కొన్ని సంవత్సరాల క్రితం కలిసుందాం రా అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించి ఏకంగా టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ ను అందుకున్నాడు. ఇకపోతే ఈ సినిమాను 2000 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14 వ తేదీన విడుదల చేశారు. ఈ సినిమా ఆ సమయం లో అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసే టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో వెంకటేష్ కు జోడిగా సిమ్రాన్ నటించగా ... ఉదయ్ శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. విశ్వనాథ్ , శ్రీహరి మూవీ లో కీలక పాత్రలలో నటించారు. ఈ సినిమా విడుదల అయ్యి నిన్నటితో 26 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఈ సందర్భంగా ఈ సినిమా ఆ సమయం లో ఎన్ని కోట్ల కలెక్షన్లను వసూలు చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది అనే వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి ఫైనల్ బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి నైజాం ఏరియాలో 5.25 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ లో 2.9 కోట్లు , వైజాగ్ లో 1.5 కోట్లు , ఈస్ట్ లో 1.6 కోట్లు , వేస్టులో ఒక కోటి , కృష్ణ లో 1.12 కోట్లు , గుంటూరు లో 1.5 కోట్లు , నెల్లూరు లో 70 లక్షల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమాకు 15.03 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ఇక కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపుకొని ఈ సినిమాకు ఒక కోటి కలెక్షన్లు వచ్చాయి. ఈ మూవీ కి మొత్తంగా టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి 16.03 కోట్ల షేర్ ... 25 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఈ సినిమా ఆ సమయంలో 25 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసి టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: