వాస్తవంగా ఈ సినిమాని సంక్రాంతి బరిలోనే విడుదల చేస్తారనుకున్నప్పటికీ కానీ సమ్మర్ ను టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తోంది. స్పిరిట్ చిత్రంలో ప్రభాస్ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతున్నారు. ప్రభాస్ కెరియర్లోనే ఒక విభిన్నమైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమా అనౌన్స్మెంట్ చేసినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి ఎలాంటి విషయమైనా సరే సంచలనంగా మారింది. ఇందులో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్, ప్రకాష్ రాజ్ తదితర నటీనటులు నటిస్తున్నారు.
అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాతో భారీ విషయాలను అందుకున్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆ తర్వాత చిత్రం ప్రభాస్ తో చేస్తూ ఉండడంతో ఈ సినిమాపై వరల్డ్ వైడ్ మార్కెట్ చూపిస్తుందని అభిమానులు నమ్ముతున్నారు. ఇంకా సినిమా విడుదలకు ఏడాది ఉండగానే సినిమాని విడుదల తేదీ ముందుగానే చెప్పేయడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇప్పటికే విడుదలైన సౌండ్ స్టోరి టీజర్ అభిమానుల అంచనాలను విపరీతంగా పెంచేసింది. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మరి రాబోయే రోజుల్లో వరుస అప్డేట్లతో సినిమాని మరింత హైప్ పెంచేస్తారేమో చూడాలి మరి. ప్రభాస్ ఈ ఏడాది నటించిన రాజా సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మిక్స్డ్ టాక్ ను సంపాదించుకుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి