శ్రీ సత్య మాట్లాడుతూ.. తనకి ఒకానొక సమయంలో పెద్ద యాక్సిడెంట్ అయ్యిందని, తాను, నాన్న కారులో ప్రయాణిస్తూ ఉండగా టిప్పర్ లారీ వెనకనుంచి వచ్చి తమ కారుని గుద్దేసింది. టిప్పర్ లారీ వెనక్కి వెళ్ళినా కూడా కారుతో పాటు లాగేసింది. ఆ సమయంలోనే టిప్పర్ లారీ ఆపేశాడు. కరెక్ట్ గా నాకి దగ్గరలో ఆగిపోయింది. ఇంకొంచెం ముందుకు వెళ్లిన తాను ఆల్మోస్ట్ చచ్చిపోయే దాన్ని అంటూ శ్రీ సత్య తెలియజేసింది. తాను ఎప్పటినుంచో శివమాల వేయాలనుకున్నాను కానీ అది ఎప్పుడూ కుదరలేదు. ఆ సంఘటన తర్వాత ఎందుకో వేయాలనిపించింది. వెంటనే వేసేసానని తెలిపింది. అందుకే తాను శివమాల వేసుకున్నానని ఆ తర్వాత తన జీవితం బాగుందని తెలిపింది శ్రీ సత్య. అంతేకాకుండా అప్పుడప్పుడు తాను భైరవ మాల కూడా వేసుకుంటానంటూ తెలియజేసింది శ్రీ సత్య.
తెలుగులో నిన్నే పెళ్ళాడుతా, త్రినయని వంటి సీరియల్స్లలో నటించింది. తనకు ఫేవరెట్ హీరో రామ్ పోతినేని అని తెలియజేసింది అలాగే తాను ఇంటర్ తర్వాత చదువు ఆపేసి సినిమాలలోకి వెళ్తానంటే తన తల్లి తనతో మాట్లాడడం కూడా మానేసిందని అయితే నాన్న మాత్రం తనని ఎంకరేజ్ చేసే వారిని తెలియజేసింది. అలా టీవీలో మిస్ విజయవాడ పోటీలలో స్క్రోలింగ్ చూసి ప్రయత్నించానని తెలియజేశారు. అలా వెళ్ళిన నేను చివరిగా విజేతగా నిలిచాను అంటూ తెలియజేసింది శ్రీ సత్య.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి