మెగాస్టార్ చిరంజీవి పేరు వింటేనే థియేటర్లు దద్దరిల్లాలి.. అది హైదరాబాద్ అయినా, హ్యూస్టన్ అయినా! 2026 సంక్రాంతి బరిలో దిగిన బాస్, 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాతో బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలుపెట్టారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఈ చిత్రం యూఎస్ బాక్సాఫీస్ వద్ద 2.2 మిలియన్ డాలర్ల ($2.2M+) మార్కును అత్యంత వేగంగా దాటేసి, మెగాస్టార్ స్టామినా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పింది.


యూఎస్ మార్కెట్‌లో చిరంజీవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ, ఈ సినిమా సాధించిన వసూళ్లు మాత్రం ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేస్తున్నాయి.ప్రీమియర్ షోల నుంచే పాజిటివ్ టాక్ రావడంతో, వీకెండ్ ముగిసేలోపు ఈ చిత్రం 2.2 మిలియన్ డాలర్ల క్లబ్బులో చేరిపోయింది.అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్ ఓవర్సీస్ ప్రేక్షకులకు (ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌కు) బాగా కనెక్ట్ అయ్యింది. చిరంజీవి వింటేజ్ మాస్ లుక్ మరియు కామెడీ టైమింగ్ చూసి ఎన్ఆర్ఐ (NRI) ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు.



ప్రస్తుతం ఉన్న ట్రెండ్ చూస్తుంటే, ఈ సినిమా చాలా త్వరగా 3 మిలియన్ డాలర్ల మార్కును కూడా దాటేలా కనిపిస్తోంది. మెగాస్టార్ కెరీర్‌లో ఓవర్సీస్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా 'MSG' నిలిచిపోవడం ఖాయం. పక్కా లోకల్ కథ అయినప్పటికీ, గ్లోబల్ స్థాయిలో ఇంతటి ఆదరణ దక్కడం మెగాస్టార్ మ్యాజిక్ అనే చెప్పాలి. బాస్ ఈజ్ బ్యాక్ అని ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు.అమెరికాలోని డల్లాస్, న్యూజెర్సీ, కాలిఫోర్నియా వంటి నగరాల్లోని థియేటర్ల వద్ద మెగా ఫ్యాన్స్ హంగామా మాములుగా లేదు. కటౌట్లకు పాలాభిషేకాలు, థియేటర్ల లోపల పేపర్ల వర్షంతో విదేశీ గడ్డపై కూడా పక్కా తెలుగు సినిమా వాతావరణం కనిపిస్తోంది. చిరంజీవి డాన్సులు, విక్టరీ వెంకటేష్ క్యామియో అప్పీల్ ఈ సినిమాకు అదనపు బలాన్ని ఇచ్చాయి.



సినిమా ఓవర్సీస్ హక్కులను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లకు ఇప్పటికే బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాల బాట పట్టినట్లు సమాచారం. సంక్రాంతి సీజన్ కావడంతో రాబోయే రోజుల్లో కూడా ఈ జోరు తగ్గేలా లేదు. కేవలం యూఎస్ మాత్రమే కాదు, యూకే, ఆస్ట్రేలియాలో కూడా ఈ చిత్రం ఘనమైన వసూళ్లు రాబడుతోంది.వయసు పెరుగుతున్నా.. మెగాస్టార్ లోని ఆ గ్రేస్, ఆ పవర్ ఏమాత్రం తగ్గలేదని 'మన శంకర వరప్రసాద్ గారు' నిరూపించింది. బాక్సాఫీస్ వద్ద ఒక రికార్డును క్రియేట్ చేయడం కాదు, క్రియేట్ అయిన రికార్డును తిరగరాయడం మెగాస్టార్‌కే చెల్లింది.

మరింత సమాచారం తెలుసుకోండి: