విడుదలకు ముందే యూఎస్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఈ సినిమా $90K వసూలు చేసి, ఆ రోజు ఉన్న ఇతర పెద్ద సినిమాల కంటే పైచేయి సాధించింది.అమెరికా మరియు కెనడా వ్యాప్తంగా సుమారు 800కు పైగా స్క్రీన్లలో విడుదలైన ఈ సినిమా, ప్రతి చోటా హౌస్ ఫుల్ బోర్డులతో దర్శనమిస్తోంది.పండుగ సెలవులు కలిసి రావడంతో, ఈ వీకెండ్ ముగిసే సమయానికి 1.5 మిలియన్ డాలర్ల మార్కును టార్గెట్ చేస్తోంది.అమెరికాలోని తెలుగు ప్రేక్షకులకు నవీన్ పొలిశెట్టి కామెడీ అంటే ఒక ప్రత్యేకమైన క్రేజ్. ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ కామెడీ ఉండటం ఈ సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్.సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ విలువలు, మిక్కీ జే మేయర్ సంగీతం సినిమాకు క్లాస్ టచ్ ఇచ్చాయి. నవీన్ చేసే 'పెళ్లి సందడి' హంగామా, సెకండాఫ్‌లో వచ్చే పొలిటికల్ సెటైర్స్ ఓవర్సీస్ ఆడియన్స్‌కు కడుపుబ్బ నవ్విస్తున్నాయి.
కేవలం యూఎస్ మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రెండు రోజుల్లోనే ₹41.2 కోట్ల గ్రాస్ వసూలు చేసి నవీన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. యూఎస్‌లో డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి ఇప్పటికే సగం కంటే ఎక్కువ వెనక్కి వచ్చేసింది. త్వరలోనే ఇది అక్కడ 'బ్లాక్ బస్టర్' స్టేటస్ అందుకోవడం ఖాయం.మొత్తానికి 'అనగనగా ఒక రాజు' చిత్రంతో నవీన్ పొలిశెట్టి ఓవర్సీస్ కింగ్‌గా తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. డాలర్ల వేటలో 'రాజు' గారు చూపిస్తున్న ఈ స్పీడు చూస్తుంటే, అమెరికాలో నవీన్ స్టామినా ఏంటో మరోసారి అర్థమవుతోంది. బాక్సాఫీస్ వద్ద ఈ 'రాజు' గారి రచ్చ ఇప్పట్లో ఆగేలా లేదు!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి