ఇదిలా ఉండగా, సోషల్ మీడియాలో మరో క్రేజీ వార్త తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే… అనిల్ రావిపూడి మలయాళ ఇండస్ట్రీ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్‌తో సినిమా చేయబోతున్నారని. ఈ వార్త వినగానే నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. టాలీవుడ్ డైరెక్టర్ – మలయాళ స్టార్ హీరో కాంబో అంటే నిజంగా ఊహకందని విషయం అని చెప్పాలి. ఫహద్ ఫాజిల్ తన నటనతో ప్రతి పాత్రకు ప్రాణం పోసే నటుడిగా ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాంటి నటుడితో అనిల్ సినిమా అంటే అది ఎలాంటి కాన్సెప్ట్‌తో ఉండబోతుందో అనే ఆసక్తి రెట్టింపు అవుతోంది.ఈ రెండు వార్తలు కలిసి చూస్తే, అనిల్ రావిపూడి ఈసారి క్రేజీ హీరోలను లైనప్ చేసి పూర్తిగా కొత్త జానర్‌లోకి అడుగుపెట్టబోతున్నారా అనే చర్చలు కూడా మొదలయ్యాయి. ఇప్పటివరకు ఆయన ఎక్కువగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లకే పరిమితమయ్యారు. కానీ ఈసారి మాత్రం అదిరిపోయే యాక్షన్ థ్రిల్లర్ సినిమాను ప్లాన్ చేస్తున్నారని సోషల్ మీడియాలో నెటిజన్స్ పోస్టులు షేర్ చేస్తున్నారు. “ఇదెక్కడి కాంబోరా దేవుడా..!” అంటూ అనిల్ నెక్స్ట్ మూవీపై ఫ్యాన్స్ హడావుడి మామూలుగా లేదు.
ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో అనిల్ రావిపూడి పేరు ట్రెండింగ్‌లో నిలుస్తోంది. కొందరు ఫ్యాన్స్ ఇప్పటికే ఊహాజనిత కథలతో పోస్టర్లు కూడా డిజైన్ చేసి షేర్ చేయడం విశేషం. ఇది కేవలం రూమర్ అయినా సరే, ఈ స్థాయిలో బజ్ రావడం మాత్రం అనిల్ క్రేజ్‌ను స్పష్టంగా చూపిస్తోంది.అయితే ఈ వార్తల్లో నిజమెంత అన్నది ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి క్లారిటీ రాలేదు. అనిల్ రావిపూడి గానీ, సంబంధిత హీరోలు గానీ ఈ విషయంపై స్పందించలేదు. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు… ఈ ప్రాజెక్ట్‌పై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఇప్పటికే అనిల్ రావిపూడి వచ్చే ఏడాది సంక్రాంతికి కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తానని ప్రకటించారు. సంక్రాంతి సీజన్ అంటే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లకు గ్యారంటీ అనే విషయం తెలిసిందే. అలాంటి టైమ్‌లో అనిల్ సినిమా అంటే అంచనాలు సహజంగానే ఆకాశాన్ని తాకుతాయి.మొత్తానికి, అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీ ఎవరితో, ఎలాంటి కథతో, ఏ జానర్‌లో ఉంటుంది అన్నది ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తికరమైన అంశంగా మారింది. అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పడకపోయినా, అభిమానుల ఉత్సాహం మాత్రం రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. చూడాలి మరి… అనిల్ ఈసారి ప్రేక్షకులకు ఎలాంటి సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నారో!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి