ఈ చిత్రంలో మరి కొంతమంది నటీనటుల పాత్రల కోసం చిత్ర బృందం సంప్రదిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో చిరంజీవి కూతురి పాత్ర చాలా కీలకం, అందుకే ఈ పాత్ర కోసం చాలామందిని పరిశీలించి చివరికి పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో నటించిన బాలీవుడ్ హీరోయిన్ సారా అర్జున్ ను ఎంపిక చేసుకున్నట్లు వినిపిస్తున్నాయి. చైల్డ్ యాక్టర్ గా మెప్పించిన సార ఇటీవలే బాలీవుడ్ లో దురంధర్ చిత్రంతో మరోసారి మంచి విజయాన్ని అందుకొని తన పాత్రకి మంచి గుర్తింపు అందుకుంది.
ముఖ్యంగా దురంధర్ చిత్రంలో ఆమె నటన, స్క్రీన్ పైన కనిపించిన తీరు కూడా బాగుండడంతో డైరెక్టర్ బాబి ఇటీవలే సారాకు కథ వినిపించగా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు బాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే మొదట ఈ పాత్ర కోసం ఉప్పెన సినిమా హీరోయిన్ కృతి శెట్టి పేరు వినిపించగా, వరుస ప్లాపులతో సతమతమవుతూ ఉండడంతో డైరెక్టర్ బాబి సారా అర్జున్ వైపుగా మక్కువ చూపినట్లు తెలుస్తోంది. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ విషయం మాత్రం ఇప్పుడు ఫైనల్ గా మారింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న చిత్ర బృందం అధికారికంగా ఈ విషయం పైన ప్రకటిస్తారేమో చూడాలి మరి. అలాగే విశ్వంభర చిత్రం కూడా ఈ ఏడాది రిలీజ్ చేయబోతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి