అద్భుతమైన నటనతో, నేచురల్ ఎక్స్‌ప్రెషన్స్‌తో సౌత్ ఇండియాలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న 'నేచురల్ బ్యూటీ' నిత్యా మీనన్ ఇప్పుడు మరో కొత్త అవతారం ఎత్తింది. కేవలం వెండితెరపై నటిగా అలరించడమే కాకుండా, ఇప్పుడు మెగా ఫోన్ పట్టుకోవడానికి సిద్ధమైంది. అవును, మీరు విన్నది నిజమే! నిత్యా మీనన్ ఇప్పుడు నిర్మాతగా మారింది!తన అభిరుచికి తగ్గట్టుగా, క్వాలిటీ సినిమాలను ప్రేక్షకులకు అందించాలనే లక్ష్యంతో సొంత ప్రొడక్షన్ హౌస్‌ను అనౌన్స్ చేసి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది.సోషల్ మీడియా వేదికగా నిత్యా మీనన్ తన కలల ప్రాజెక్టును రివీల్ చేసింది. తన నిర్మాణ సంస్థకు "కేయూరి ప్రొడక్షన్స్" అనే పవర్ ఫుల్ పేరును ఖరారు చేసింది. ఒక వీడియో సందేశం ద్వారా తన మనసులో మాటను అభిమానులతో పంచుకుంది. ఈ బ్యానర్ కేవలం సినిమాలు తీయడానికే కాదు, ఒక కొత్త ఒరవడిని సృష్టించడానికి పుట్టిందని ఆమె మాటల్లో స్పష్టమవుతోంది.


సాధారణంగా నిర్మాతలు అంటే కమర్షియల్ లెక్కలు, కోట్లు కొల్లగొట్టే ఫార్ములా సినిమాలు అనుకుంటారు. కానీ నిత్యా మీనన్ ఆలోచనలు వేరు. ఆమె ఎంచుకునే పాత్రల్లాగే ఆమె బ్యానర్ లో వచ్చే సినిమాలు కూడా చాలా వైవిధ్యంగా ఉండబోతున్నాయని టాక్.కేయూరి ప్రొడక్షన్స్ లో వచ్చే సినిమాలు కథా బలమున్నవిగా ఉంటాయని ఆమె స్పష్టం చేసింది. కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాకుండా, ప్రేక్షకుల హృదయాలను తాకేలా, సమాజంపై సానుకూల ప్రభావం చూపే కథలకే ఆమె పెద్దపీట వేయబోతోంది.లోతైన పాత్రలు, మనసుకు హత్తుకునే భావోద్వేగాలతో కూడిన సినిమాలను నిర్మించడమే తన లక్ష్యమని నిత్య వెల్లడించింది.



జాతీయ అవార్డు గ్రహీతగా నిత్యా మీనన్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆమె ఏ పని చేసినా అందులో ఒక పర్ఫెక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఆమె నిర్మాతగా మారడంతో సినిమా ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. "ఒక టాలెంటెడ్ నటి నిర్మాతగా మారితే, ఖచ్చితంగా మంచి సినిమాలు వస్తాయి" అని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.ప్రస్తుతానికి నిత్యా మీనన్ చేతిలో కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. తన పాత కమిట్‌మెంట్లను పూర్తి చేస్తూనే, సైడ్ బై సైడ్ తన బ్యానర్‌లో మొదటి సినిమాను పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తోంది. ఇంకా అఫీషియల్‌గా ఏ సినిమానూ అనౌన్స్ చేయనప్పటికీ, త్వరలోనే ఒక సర్ప్రైజ్ అప్‌డేట్ ఇచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: