సాధారణంగా సినిమా షూటింగ్ సమయంలోనే నటీనటులు దర్శకులకు ఇలాంటి కానుకలు ఇవ్వడం అంటే, ఆ సినిమా అవుట్‌పుట్ పట్ల వారు ఎంత నమ్మకంతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. 'పెద్ది'లో శివ రాజ్‌కుమార్ ఒక పవర్‌ఫుల్ పాత్ర (గౌర్నాయుడు) పోషిస్తున్నారు. తన క్యారెక్టర్ డిజైన్ చేసిన విధానం చూసి ముగ్ధుడైన శివన్న, బుచ్చిబాబుపై ఉన్న గౌరవంతో ఈ గిఫ్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.'పెద్ది' చిత్రం కేవలం ఒక స్పోర్ట్స్ డ్రామా మాత్రమే కాదు, ఇది ఒక రా అండ్ రస్టిక్ విలేజ్ యాక్షన్ ఎంటర్టైనర్.ఈ సినిమాలో చరణ్ మునుపెన్నడూ లేని విధంగా ఒక మాస్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన కొన్ని పోస్టర్లు, గ్లింప్స్ అభిమానులకు పూనకాలు తెప్పించాయి.అతిలోక సుందరి తనయ జాన్వీ కపూర్ ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించబోతోంది. చరణ్-జాన్వీ జోడీ స్క్రీన్‌పై మ్యాజిక్ చేయడం ఖాయం.ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇటీవల విడుదలైన 'చికిరి' సాంగ్ ఇప్పటికే చార్ట్‌బస్టర్‌గా నిలిచింది.శివ రాజ్‌కుమార్ తో పాటు జగపతి బాబు, హిందీ నటుడు దివ్యేందు శర్మ వంటి దిగ్గజాలు ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం సినిమా రేంజ్‌ను పెంచేసింది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే భారీ క్రికెట్ సీక్వెన్స్ సినిమాకే హైలైట్ అని టాక్. 'గేమ్ ఛేంజర్' తర్వాత రామ్ చరణ్ నుంచి వస్తున్న పక్కా లోకల్ మాస్ సినిమా కావడంతో మెగా ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.ఇక మెగా అభిమానులు అయితే మరో అడుగు ముందుకేసి.. "సినిమా సెట్స్ పై ఉండగానే లక్ష రూపాయల వాచ్ వస్తే, సినిమా బ్లాక్ బస్టర్ అయ్యాక చరణ్ నుంచి లగ్జరీ కార్ గ్యారెంటీ" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో సుజీత్, అనిల్ రావిపూడి వంటి దర్శకులకు హీరోల నుంచి కార్లు గిఫ్ట్‌గా వచ్చిన సంగతి తెలిసిందే. మరి బుచ్చిబాబు 'పెద్ది'తో ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి. ఏప్రిల్ 30న థియేటర్లలో బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయం!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి