ఈ కేసు పైన తక్షణమే విచారణ తీసుకోవాలని అభ్యర్థనలు చేసినప్పటికీ కోర్టు మాత్రం సెలబ్రెటీ అయినంత మాత్రాన ఎటువంటి స్పెషల్ ట్రీట్మెంట్ ఉండదంటూ వ్యాఖ్యానించారు. దీంతో అతడు వేసుకున్న పిటిషన్ ని తిరస్కరించింది. గత ఏడాది గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ముగింపులో పంజార్లి, గుళిక దేవుళ్ళ హావభావాలను చాలా హాస్యాస్పదంగా చేయడంతో రణవీర్ సింగ్ పైన ఫిర్యాదు చేశారు. హీరో రిషబ్ శెట్టి ను వెక్కిరిస్తూ ఫోటోలకు ఫోజులు ఇవ్వడం పట్ల రణవీర్ సింగ్ పైన బెంగళూరు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైన సంగతి అందరికీ తెలిసిందే. హిందువుల మనోభావాలు దెబ్బ తిన్నాయని కర్ణాటక తీర ప్రాంత ప్రజల చాముండి దైవ సాంప్రదాయాన్ని కించపరిచేలా చేశారని సెక్షన్ 196,299,302 కింద అడ్వకేట్ ప్రశాంత్ మోథాల్ ఫిర్యాదు చేశారు.
పంజూర్లి దేవతను కోస్టల్ కర్ణాటక ప్రాంత ప్రజలు నిత్యం పూజిస్తూ దైవంగా భావిస్తారని అలాంటి భక్తుల మనోభావాలను గాయపరిచారు అంటూ మోథాల్ ఫిర్యాదులో తెలియజేశారు. రణవీర్ సింగ్ తదుపరి విచారణ ఏప్రిల్ 8వ తేదీన జరగబోతోంది. ఈ కేసును కొట్టివేయాలంటూ రుణవీర్ సింగ్ తరపున న్యాయవాది పిటిషన్ వేయగా..అయితే ఈ పిటిషన్ పైన ధర్మాసనం ముందుకు విచారణ రాగ, రిషబ్ శెట్టి నటన, పాత్ర ఈ చిత్రాన్ని మనస్ఫూర్తిగా ప్రశంసించడానికే తాను అలా చేశానని ఎటువంటి దురుద్దేశం లేదంటూ తాను చేసిన దానిని తప్పుగా అర్థం చేసుకున్నారని రణవీర్ సింగ్ తరఫున న్యాయవాది తెలియజేశారు. ఈ విషయంపై పోలీసులు ఇప్పటికే రెండుసార్లు నోటీసులు జారీ చేశారని అనవసరంగా ఒత్తిడిని రణవీర్ సింగ్ ఎదుర్కొనేలా ఉందంటూ పిటిషన్లో వివరించారు. ఈ కేసును అత్యవసరంగా విచారణ చేపట్టాలని రణవీర్ సింగ్ న్యాయవాది అభ్యర్థన చేయగా వాటిని తిరస్కరించింది కోర్టు. వీటిని సాధారణ ప్రక్రియలోనే అనుసరించాలని తెలియజేసింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి