రకుల్ ప్రీత్ సింగ్.. సౌత్ ఇండస్ట్రీలో గత నాలుగు సంవత్సరాల వరకు ఒక ఊపు ఊపిన హీరోయిన్. అయితే ఈ మధ్యకాలంలో ఈ హీరోయిన్ కేవలం నార్త్ సినిమాల్లోనే చేస్తున్నప్పటికీ సౌత్ లో ఈమెకు ఏమాత్రం ఆదరణ తగ్గలేదు. ఇదిలా ఉంటే రీసెంట్ గా సోషల్ మీడియాలో రకుల్ ప్రీత్ సింగ్ కి సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో రకుల్ ప్రీత్ సింగ్ ఒక అవార్డు ఫంక్షన్లో పాల్గొంది. అయితే ఆ అవార్డు ఫంక్షన్లో స్టేజి మీద  అవార్డు ఇస్తున్న సమయంలో ఆమెకు జరిగిన అవమానానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇక అందులో ఏముందంటే..రకుల్ ప్రీత్ సింగ్ ఒక అవార్డు ఫంక్షన్ లో ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ లక్షయ్ జగ్గీకి అవార్డు ఇస్తుంది. 

కానీ ఆ అవార్డ్ ఇచ్చిన సమయంలో ఫిట్నెస్ ఇన్సూరెన్సర్ జగ్గీ ప్రవర్తించిన తీరు కి రకుల్ చాలా అసహనంగా ఫీల్ అయింది. ఇక ఈ వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో చాలామంది రకుల్ ప్రీత్ సింగ్ అభిమానులు స్టేజ్ మీదే మా హీరోయిన్ ని ఇంత అవమానిస్తారా అంటూ ఫైర్ అవుతున్నారు. మరి ఇంతకీ ఆ వీడియోలో ఏముంది అంటే ఫిట్నెస్ ఇన్సూరెన్సర్ జగ్గీ కి రకుల్ ప్రీత్ సింగ్ చేతుల మీదుగా అవార్డు అందించారు. అయితే అలా అవార్డు అందించిన సమయంలో ఆ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ జగ్గి చాలా అగ్రెసివ్ లుక్ లో కనిపిస్తూ స్టేజి మీదకి వచ్చి కనీసం ఫేస్ లో నవ్వు కూడా కనిపించకుండా నడుచుకుంటూ వచ్చాడు.ఆ తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ అవార్డు ఇస్తున్న సమయంలో కనీసం ఫోటోకి ఫోజులు కూడా ఇవ్వకుండా రకుల్ ప్రీత్ సింగ్ చేతిలో ఉన్న అవార్డుని తన చేతిలోకి లాక్కొని సైలెంట్ గా వెళ్ళిపోయాడు. అయితే ఫిట్నెస్ ఇన్ఫ్లూయెన్సర్ లక్షయ్ జగ్గీ ప్రవర్తనకి రకుల్ కాస్త అవమానంగా ఫీల్ అయినట్టు లుక్ పెట్టింది. 

దీంతో ఈ వీడియో వైరల్ అవ్వడంతో రకుల్ ప్రీత్ సింగ్ కి అవమానం జరిగినట్టు ఆమె అభిమానులు ఫైర్ అవుతున్నారు. అయితే ఈ వీడియో పై ఫిట్నెస్ ఇన్ఫ్లూయెన్సర్ జగ్గీ స్పందిస్తూ.. నాకంటే ముందు మరో మహిళకి అవార్డు ఇస్తున్నప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ ఆమెకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నిరాకరించింది.అందుకే ఆమెకి షేక్ హ్యాండ్ ఇవ్వడం నచ్చదు కావచ్చు అని నేను రకుల్ ప్రీత్ సింగ్ చేతిలో నుండి అవార్డు తీసుకొని నార్మల్గానే వచ్చేసాను అంటూ ఇన్ఫ్లూయెన్సర్ లక్షయ్ జగ్గీ క్లారిటీ ఇచ్చారు.అయితే ఇన్ఫ్లూయెన్సర్ జగ్గీ ఈ వీడియో పై క్లారిటీ ఇవ్వడంతో చాలామంది నెటిజెన్లు తిరిగి రకుల్ పై ఫైర్ అవుతున్నారు.కర్మ రిటర్న్స్ అన్నట్లు నువ్వు ఆ మహిళకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నిరాకరించావు ఆ తర్వాత ఇన్ఫ్లూయెన్సర్ నీకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నిరాకరించారు.. నువ్వు ఏది చేస్తే తిరిగి నీకు అదే దక్కుతుంది అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: