రామ్ చరణ్ డ్యాన్స్ గురించి మనందరికీ తెలిసిందే. కానీ 'పెద్ది' సినిమాలో ఆయన బాడీ లాంగ్వేజ్, ఆ రస్టిక్ లుక్ చూసి చిరంజీవి ఆశ్చర్యపోయారట. "రాయ్ రాయ్ రా రా పాట చూశాను. చరణ్ బాడీ లాంగ్వేజ్‌లో ఒక కొత్త ఎనర్జీ కనిపిస్తోంది. రెహమాన్ మ్యూజిక్ పల్స్ బాగుంది. బుచ్చిబాబు తన విజన్‌తో చరణ్‌ను సరికొత్తగా ప్రెజెంట్ చేశాడు. చరణ్ డ్యాన్స్ మూమెంట్స్ చూస్తుంటే నాకే మళ్ళీ స్టెప్పులు వేయాలనిపిస్తోంది" అంటూ చిరు తన సంతోషాన్ని పంచుకున్నారు. ఒక తండ్రిగా తన కొడుకు గ్లోబల్ స్టార్‌గా ఎదుగుతూ, మళ్ళీ ఇలాంటి పక్కా లోకల్ మాస్ సాంగ్‌లో అదరగొట్టడం చూసి చిరు గర్వపడుతున్నారు.
సాధారణంగా రెహమాన్ క్లాస్ మ్యూజిక్ ఇస్తారని పేరుంది, కానీ 'పెద్ది' కోసం ఆయన ఒక 'మాస్ అరాచకాన్ని' సృష్టించారు.ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు ప్రాణం పోశారని, ముఖ్యంగా ఈ పాటలో ఉన్న జానపద టచ్ చిరంజీవికి బాగా నచ్చిందట. 'ఉప్పెన'తో అందరినీ ఆకట్టుకున్న బుచ్చిబాబు, ఇప్పుడు 'పెద్ది'తో రామ్ చరణ్‌ను ఒక లెజెండరీ లెవల్‌లో చూపిస్తున్నారని మెగాస్టార్ కొనియాడారు.నిన్నటి నుంచి ఇంటర్నెట్‌లో ఎక్కడ చూసినా ఈ పాటదే హడావుడి.గడ్డం, జుట్టు పెంచి ఒక ఊరమాస్ లుక్‌లో చరణ్ కనిపిస్తుంటే.. ఫ్యాన్స్ "రాకీ భాయ్ తర్వాత ఆ రేంజ్ ఇంపాక్ట్ చరణ్ కే సాధ్యం" అని కామెంట్ చేస్తున్నారు.ఈ పాట ఇప్పటికే మిలియన్ల వ్యూస్ సాధించి, మ్యూజిక్ చార్ట్‌లలో టాప్ వన్ లో ట్రెండ్ అవుతోంది. జాన్వీ కపూర్ గ్లామర్ కూడా ఈ సాంగ్‌కు అదనపు ఆకర్షణగా నిలిచింది.
చిరంజీవి రియాక్షన్ రావడంతో మెగా ఫ్యాన్స్ జోష్ డబుల్ అయింది. మెగా పవర్ స్టార్ 'పెద్ది' పాట మాత్రం విజువల్స్ అండ్ ఆడియో పరంగా అందరినీ డామినేట్ చేస్తోంది.పెద్ది ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. సమ్మర్ హాలిడే సీజన్‌ను డామినేట్ చేయడానికి ఇది పర్ఫెక్ట్ టైం. ఇదిలా ఉంటే.. రామ్ చరణ్ డ్యాన్స్ పై చిరంజీవి రియాక్ట్ అయ్యారు. రామ్ చరణ్ ను ఇలా చూడటం నాకు అపారమైన గర్వాన్ని నింపుతుంది. అతను కదిలే విధానం చూడటానికి ఆనందంగా ఉందని ట్వీట్ చేశారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి