టాలీవుడ్లో అగ్ర హీరోగా పేరు సంపాదించిన విజయ్ దేవరకొండ పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక ఫిబ్రవరి 26న ప్రేమించి పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు.. వివాహమనంతరం సొంత గ్రామంలో తన భార్యతో కలిసి పర్యటించారు విజయ్ దేవరకొండ అక్కడ కొన్ని ప్రత్యేకమైన పూజలలో కూడా పాల్గొన్నారు. అలాగే రీసెంట్గా హైదరాబాద్ రిసెప్షన్ లో కూడా పాల్గొన్న ఈ జంట గత వారం రోజులుగా ఎక్కడ చూసినా రష్మిక, విజయ్ దేవరకొండ పెళ్లి గురించి పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి.


ముఖ్యంగా వీరికి సంబంధించిన ఫోటోలు, దేవాలయాలకు పంపించిన స్వీట్లు గురించి పలు రకాల వార్తలు వినిపించాయి. తాజాగా ఈ జంట పెళ్లి కోసం ఎంత ఖర్చు చేశారనే విషయం కూడా ఇప్పుడు వైరల్ గా మారింది. విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు వినికిడి. ఉదయపూర్ లో ప్యాలెస్ లో నాలుగు రోజులు వేడుకల కోసం, మొన్న హైదరాబాదులో జరిగిన రిసెప్షన్ కోసం సుమారుగా  రూ.15 నుంచి రూ .20కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసినట్లు వినిపిస్తున్నాయి.



వివాహం కోసం మూడు కేజీల బంగారు ఆభరణాలు కూడా కొనుగోలు చేశారట విజయ్ దేవరకొండ. ఇక రష్మిక కూడా కోట్ల రూపాయల బంగారు ఆభరణాలను ధరించింది. విజయ్ దేవరకొండ రష్మిక వివాహ వీడియోని నెట్ ఫ్లిక్ సుమారుగా రూ.60 కోట్ల రూపాయలకు సొంతం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే విజయ్ దేవరకొండ తన సొంత గ్రామంలో కూడా స్కూళ్లను దత్తకు తీసుకొని మరి పిల్లలను చదివిస్తానని ప్రకటించారు. అలాగే తన తమ్ముడి వివాహం కూడా తన సొంత ఊరిలోనే చేస్తానని అక్కడివారికి మాట ఇచ్చారు. విజయ్ దేవరకొండ ప్రస్తుతం రణబలి, రౌడీ జనార్ధన్ వంటి చిత్రాలలో నటిస్తున్నారు. రష్మిక రణబలి, కాక్టైల్ 2, మైసా, అనిమల్ పార్క్ తదితర చిత్రాలలో నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: