కోలీవుడ్ మొత్తం విజయ్ భార్యతో తీసుకునే విడాకుల గురించి మాట్లాడుకుంటుండగా సడన్గా విజయ్ త్రిషతో కలిసి ఓ పెళ్లికి వచ్చి అందరికీ మరింత పెద్ద షాక్ ఇచ్చారు. అంతేకాదు సంగీత విడాకులు తీసుకోవడానికి కారణం విజయ్ కి ఒక నటితో ఉన్న అక్రమ సంబంధమే అని చెప్పడంతో ఆమె మీద ప్రతీకారం తీర్చుకోవడానికే ఇలా త్రిషతో కలిసి పెళ్లికి వచ్చినట్టు చాలామంది మాట్లాడుకున్నారు. ఇదిలా ఉంటే తాజాగా పెళ్లికి విజయ్ త్రిష ఇద్దరు కలిసి రావడాన్ని తప్పుబట్టారు నటుడు డైరెక్టర్ సముద్రఖని. ఆయన తాజాగా ఓ సినిమాకి సంబంధించిన పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 

అయితే ఈ పూజా కార్యక్రమాల్లో డైరెక్టర్ బాలా మరియు ఆర్.వి. ఉదయ్ కుమార్ లతో విజయ్ ప్రవర్తన గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్లు చేశారు. విజయ్ ఏమైనా ఆటలాడుతున్నాడా.. ఇదేమైనా ఆటలా..ఎవరి మీద పగ తీర్చుకోవడానికి ఇలా చేస్తున్నాడు. ఆమెను ఇంట్లోనే పెట్టుకోవచ్చు కదా.. బయటికి ఎందుకు తీసుకురావడం.. ఇన్ని జరిగినా బయటకు తీసుకురావడం అవసరమా.. నాలుగు గోడల మధ్య ఇంట్లో ఉంచుకోవచ్చు కదా.. అంటూ సముద్రఖని విజయ్ ని  ఉద్దేశిస్తూ కోపంగా మాట్లాడిన మాటలు ప్రస్తుతం కోలీవుడ్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో చాలామంది నెటిజన్స్ విజయ్ చేసిన పని సినీ ఇండస్ట్రీ వాళ్లకు కూడా నచ్చడం లేదు.

బంగారం లాంటి భార్యని పక్కనపెట్టి ఆ హీరోయిన్ మాయలో పడడం ఏంటో అంటూ మండి పడుతున్నారు. ఇప్పటికే హీరోయిన్ త్రిషని సోషల్ మీడియాలో చాలామంది విజయ్ ఫ్యాన్స్ ఏకీపారేస్తున్నారు. బంగారం లాంటి మా అన్నయ్య కాపురంలో చిచ్చుపెట్టావ్ అంతకంతకు అనుభవిస్తావ్ అంటూ ఫైర్ అవుతున్నారు.. ఇక విజయ్ త్రిషని తీసుకొని బహిరంగ వేడుకకి రావడంతో ఇది చూసిన సంగీత షాకింగ్ నిర్ణయం తీసుకొని చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో మరో పిటిషన్ వేసింది.విడాకులు మంజూరు అయ్యే వరకు నేను కూడా విజయ్ ఇంట్లోనే ఉంటాను. ఎందుకంటే నాకూ ఆ ఇంట్లో వాటా ఉంది.అలాగే నాకు మరో ఇల్లు దొరికే వరకు విడాకులు వచ్చేవరకు నేను అక్కడే ఉంటాను అంటూ సంగీత పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: