టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బాక్సాఫీస్ రికార్డులనే కాదు.. తన బిజినెస్ సామ్రాజ్యాన్ని కూడా ప్యాన్ ఇండియా రేంజ్‌లో విస్తరిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ అమీర్‌పేటలో ‘AAA’ మల్టీప్లెక్స్‌తో సినీ ప్రియులకు కొత్త అనుభూతిని అందించిన బన్నీ, ఇప్పుడు అంతకు మించి అనేలా అత్యంత విలాసవంతమైన ‘అల్లు సినిమాస్’ (Allu Cinemas) ను సిద్ధం చేశారు. కోకాపేటలో నిర్మిస్తున్న ఈ అత్యాధునిక మల్టీప్లెక్స్ ఎప్పుడు ప్రారంభమవుతుందా అని ఎదురుచూస్తున్న మూవీ లవర్స్‌కు క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది!


అల్లు శిరీష్ వివాహ వేడుకలో అల్లు అర్జున్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మధ్య కనిపించిన ఆత్మీయత ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే సాన్నిహిత్యంతో రేవంత్ రెడ్డి స్వయంగా ఈ మల్టీప్లెక్స్‌ను ప్రారంభించబోతున్నారని సమాచారం.బన్నీ ఆహ్వానం మేరకు సీఎం రేవంత్ రెడ్డి మార్చి 12న కోకాపేట ‘అల్లు సినిమాస్’కు ముఖ్య అతిథిగా రానున్నారు. దీంతో ఈ ఓపెనింగ్ ఈవెంట్ పక్కా పొలిటికల్ అండ్ సినీ గ్లామర్‌తో కళకళలాడనుంది.సంధ్య థియేటర్ వివాదం తర్వాత బన్నీ-రేవంత్ రెడ్డి మధ్య అంతా సజావుగానే ఉందనే విషయాన్ని ఈ ఓపెనింగ్ ఈవెంట్ మరోసారి నిరూపించబోతోంది.



కోకాపేటలోని ఈ కొత్త మల్టీప్లెక్స్ కేవలం సినిమా హాల్ మాత్రమే కాదు.. ఒక టెక్నికల్ వండర్.ఇండియాలోనే అత్యుత్తమ సౌండ్ అండ్ విజువల్ క్వాలిటీ ఇచ్చే ‘డాల్బీ సినిమా’ (Dolby Cinema) వెర్షన్ ఇందులో అందుబాటులోకి రానుంది. మూవీ లవర్స్ కోరుకునే హై-క్లాస్ ఎక్స్‌పీరియన్స్ ఇక్కడ గ్యారెంటీ.ఇంటీరియర్ నుంచి స్క్రీన్ రిజల్యూషన్ వరకు అల్లు అర్జున్ స్వయంగా పర్యవేక్షించి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో దీనిని తీర్చిదిద్దారు.
అల్లు సినిమాస్ ప్రారంభమైన సరిగ్గా వారం రోజులకే బాక్సాఫీస్ వద్ద పెద్ద యుద్ధం జరగబోతోంది. మార్చి 19న విడుదల కాబోతున్న క్రేజీ సినిమాలు అల్లు సినిమాస్‌లో మొదటిసారి ‘మాస్’ ట్రీట్ ఇవ్వబోతున్నాయి.



ఉస్తాద్ భగత్ సింగ్: పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న ఈ సినిమాను డాల్బీ సౌండ్‌లో చూడటం ఫ్యాన్స్‌కు పూనకాలే.

ధురంధర్ 2: యాక్షన్ సీక్వెన్స్‌లతో రాబోతున్న ఈ సినిమా కూడా అల్లు సినిమాస్ స్క్రీన్స్ పై సెన్సేషన్ క్రియేట్ చేయనుంది.

ఒకవైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు ప్రేక్షకులకు అత్యుత్తమ థియేటర్ అనుభూతిని అందించాలనే బన్నీ తపన ప్రశంసనీయం. మార్చి 12న సీఎం రేవంత్ రెడ్డి రాకతో కోకాపేట మొత్తం మెగా-అల్లు అభిమానుల కోలాహలంతో నిండిపోనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: