ప్రకృతి ఒడిలో, పచ్చని చెట్ల మధ్య హంసా నందిని దిగిన లేటెస్ట్ ఫోటోలు చూస్తుంటే.. ఆమెలోని ఆత్మవిశ్వాసం ఉట్టిపడుతోంది.అనారోగ్యం పాలైందని ఎక్కడా అనిపించకుండా, ఎంతో ఉల్లాసంగా, నవయవ్వనంగా కనిపిస్తున్న హంసా.. తన ట్రేడ్‌మార్క్ చిరునవ్వుతో “నేను మళ్ళీ వచ్చేశాను” అని చాటి చెబుతోంది.కెమెరా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి ఆమె ఇచ్చిన భంగిమలు.. తను ఎంతటి మానసిక దృఢత్వం కలవారో స్పష్టం చేస్తున్నాయి.
గుండెల్ని కదిలించిన ఎమోషనల్ నోట్..
ఈ ఫోటోలతో పాటు హంసా రాసిన మాటలు ప్రతి ఒక్కరినీ కదిలిస్తున్నాయి. “నేను ఎన్నోసార్లు బ్రేక్ అయ్యాను.. మళ్ళీ నన్ను నేను నిర్మించుకున్నాను.. కొత్తగా పుట్టాను!” అంటూ తన క్యాన్సర్ పోరాటాన్ని అక్షరీకరించారు. తన తల్లిని బలితీసుకున్న వ్యాధే తనను చుట్టుముట్టినా.. భయపడకుండా పోరాడిన వైనం ఆమె మాటల్లో కనిపిస్తోంది. “మనం సున్నితమైన వాళ్ళం కాదు.. మనం ప్రమాదకరమైన జీవం ఉన్నవాళ్ళం!” అంటూ మహిళా శక్తిని కొనియాడారు. ఇక్కడ తాను ఎవరినో మెప్పించడానికి లేనని, కేవలం నిండుగా జీవించడానికి ఉన్నానని స్పష్టం చేశారు.
సినిమాలకు విరామం ప్రకటించిన సమయంలో హంసా నందిని ఖాళీగా కూర్చోలేదు. తనలోని ప్రయాణ ప్రేమికురాలిని బయటకు తీశారు.తన యూట్యూబ్ ఛానల్ ‘స్వాన్ స్టోరీస్’ (Swan Stories) ద్వారా ప్రపంచంలోని అద్భుతమైన ప్రదేశాలను సందర్శిస్తూ అభిమానులకు చూపిస్తున్నారు.విదేశీ పర్యాటక రంగానికి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ, అంతర్జాతీయ టూరిజం బోర్డులతో కలిసి ప్రమోషన్స్ చేస్తూ భారీగా సంపాదిస్తున్నారు. అనారోగ్యాన్ని సాకుగా చూపకుండా, కెరీర్‌ను మరో మలుపు తిప్పడం ఆమెకే చెల్లింది.
చిరునవ్వుతో కష్టాలను జయించిన ‘హంస’నందిని !
ప్రస్తుతం తన కుటుంబంతో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్న హంసా నందిని, ప్రాణం కంటే విలువైనది ఏదీ లేదని గ్రహించారు. అప్పుడప్పుడు ఇలాంటి ఫోటోషూట్‌లతో అభిమానులకు టచ్‌లో ఉంటూ, కష్టాల్లో ఉన్నవారికి ధైర్యాన్ని ఇస్తున్నారు.కష్టాలను చిరునవ్వుతో ఎదుర్కోవడం ఎలాగో నేర్పిన హంసా నందిని.. ఇప్పుడు తన జీవితంలోని ప్రతి క్షణాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాధిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి