టీవీకే పార్టీ అధ్యక్షుడు, తమిళ హీరో విజయ్ దళపతి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. తాజాగా నటుడు విజయ్ కి సీబీఐ నుంచి మరోసారి నోటీసులు వచ్చినట్లు తెలుస్తోంది. కరూర్ తొక్కిసలాట కేసులో భాగంగా మార్చి 10వ తేదీన విచారణకు హాజరుకావాలని సిబిఐ తాజాగా సామాన్లను జారీ చేసింది. 2025 సెప్టెంబర్ 27న కరూర్ ప్రాంతంలో టీవీకే పార్టీ బహిరంగ సభలో తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే.. అక్కడ కేవలం 10వేల మందికి మాత్రమే అనుమతి ఉండగా 30 వేల మంది పైగా అభిమానులు తరలివచ్చారు.


అంతేకాకుండా హీరో విజయ్ రాత్రి 7 గంటలకు ఆలస్యంగా రావడంతో ఒక్కసారిగా అభిమానులు విజయ్ ను చూడడానికి దూసుకు రావడంతో ఈ విషాదం జరిగింది. సుమారుగా 9 మంది చిన్నారులు 18 మంది మహిళలతో సహా 41 మంది ప్రాణాలు కోల్పోయారు. హీరో విజయ్ ఇప్పటికే ఈ విషయం పైన జనవరి 12, 19వ తేదీన రెండుసార్లు విచారణకు  హాజరయ్యారు. ఈ విచారణలో భాగంగా విజయ్, తొక్కిసలాట ఘటనకు టీవీకే పార్టీకి ఎటువంటి సంబంధం లేదని పరిస్థితి చేయి దాటి పోతుందని ఉద్దేశంతోనే తాను అక్కడి నుంచి  వెళ్లిపోయానని సిబిఐ కి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు.



ఈ కేసులోని అటు టీవీకే పార్టీ జనరల్ సెక్రటరీ బుస్సి ఆనంద్ ను కూడా అధికారులు విచారించారు. ఈ నేపథ్యంలోని మార్చి 10వ తేదీన విజయ్ సిబిఐ కార్యాలయానికి హాజరవుతారా లేదా  అనే విషయం తెలియాల్సి ఉంది. ఒకవైపు రాజకీయాలలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విజయ్ ఆటు కుటుంబ సమస్యలతో కూడా మరికొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా భార్య సంగీత విడాకులు కోరడంతో సంచలనంగా మారింది. అంతేకాకుండా హీరోయిన్ త్రిష తో కలిసి తిరుగుతూ ఉండడం వల్ల అటు పొలిటికల్ పరంగా సినీ సెలబ్రెటీలు కూడా చాలామంది విజయ్ ని ట్రోల్ చేస్తున్నారు. ఈ విషయాలన్నిటికీ కూడా విజయ్ కౌంటర్లు వేస్తూనే ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: