ఏంటీ ఆ హీరోయిన్ నో చెప్పడం వల్లే విజయ్ రష్మిక పెళ్లి జరిగిందా.. ఇంతకీ నో చెప్పిన ఆ హీరోయిన్ ఎవరు.. విజయ్ ప్రేమకి నో చెప్పిందా లేక మరేదైనా మ్యాటర్ ఉందా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. విజయ్ రష్మిక టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్స్.. ఒకప్పుడు లవ్ బర్డ్స్ గా ఉన్న ఈ జంట మార్చ్ 26న పెళ్లి చేసుకొని కపుల్స్ గా మారిపోయారు.. ఇక వీరి పెళ్లి జరిగాక దేశం మొత్తం వీరి పెళ్లి గురించే మాట్లాడుకుంది. ముఖ్యంగా వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఒక ఊపు ఊపేసాయి. అంతేకాదు రష్మిక విజయ్పెళ్లి ఫోటో తెగ ట్రెండ్ అవ్వడమే కాకుండా ఇండియాలో హైయ్యెస్ట్ వ్యూస్ ఉన్న ఫోటో కూడా అయింది. అలాగే ఈ పెళ్లి ఫోటోలు అంత ట్రెండ్ అవ్వడానికి ప్రధాన కారణం విజయ్ దేవరకొండ రష్మికకు మించి ఒంటనిండా నగలు ధరించడమే.. 

అయితే ఒకప్పుడు రాజుల కాలంలో ఇలా మగవాళ్లు నగలు ధరించేవారు.కానీ పాత ట్రెండ్ ని విజయ్ రీ క్రియేట్ చేశారు. ఒంటినిండా నగలతో రాజుల వివాహం లాగే చేసుకున్నారు. దీంతో చాలా రోజులు వీళ్ళ పెళ్లి గురించే మాట్లాడుకున్నారు. ఇక పెళ్లయ్యాక పుణ్యక్షేత్రాలు తిరగడమే కాకుండా అభిమానులకి ప్రేమగా లంచ్ కూడా ఏర్పాటు చేశారు.దేశవ్యాప్తంగా చాలా చోట్ల పెళ్లి జరగడంతో స్వీట్స్ పంపిణీ చేయడమే కాకుండా కొన్ని గుళ్లలో అన్నదానాలు కూడా పెట్టారు. ఇక రష్మిక విజయ్పెళ్లి విషయం పక్కన పెడితే వీరి పెళ్లి కావడానికి ప్రధాన కారణం ఓ హీరోయిన్ అట. ఆ హీరోయిన్ నో చెప్పడం వల్లే వీరి పెళ్లి జరిగిందట. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే యాక్షన్ కింగ్ అర్జున్ సార్జా కూతురు ఐశ్వర్యా అర్జున్..

ఇక అసలు విషయం ఏమిటంటే..అర్జున్ సార్జా కూతురు ఐశ్వర్యా అర్జున్ రీసెంట్ గా సీతా పయాణం అనే సినిమాతో మన ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఐశ్వర్య అర్జున్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను వదులుకున్న ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాల్లో గీతగోవిందం కూడా ఒకటి అంటూ చెప్పింది.అయితే ఐశ్వర్య అర్జున్ మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ అవ్వడంతో చాలామంది నెటిజన్స్ ఐశ్వర్య గీతా గోవిందం సినిమాలో నటించకపోవడం వల్లే రష్మికకు అవకాశం వచ్చింది.ఆ అవకాశం రావడం వల్లే విజయ్ రష్మికల మధ్య ప్రేమ బంధం చిగురించింది. అలా పరోక్షంగా విజయ్ రష్మికపెళ్లి కావడానికి ఐశ్వర్య గీతగోవిందం సినిమాకి నో చెప్పడమే కారణం అంటూ ఈ విషయాన్ని తెగ వైరల్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: