టాలీవుడ్ లో సీనియర్ నటుడుగా పేరు సంపాదించిన రాజేంద్రప్రసాద్ ఈమధ్య ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నారు. ఇటీవల హైదరాబాద్ తో జరిగిన కళాప్రపూర్ణ కాంతారావు 2025 జాతీయ అవార్డు వేడుకలలో ఆయన చేసిన ప్రసంగం సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో పెను దుమారాన్ని రేపుతోంది. ఒకప్పటి జానపద బ్రహ్మ కాంతారావు గొప్పతనాన్ని తెలియజేసే క్రమంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.జి.రామచంద్రన్ పట్ల ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు అన్ని వర్గాల వారిని విమర్శలు చేసేలా చేస్తున్నాయి.


కళాప్రపూర్ణ కాంతారావు జాతీయ అవార్డులలో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. కాంతారావు నటన చూసి ఎంజీఆర్ఏ షాక్ అయ్యారని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. జానపదాలలో కాంతారావు క్రేజీ చూసి ఎంజీఆర్ భయపడిన సందర్భాలు కూడా ఉన్నాయని అన్నారు. ఎవడ్రా వీడు ఇండియన్ చిత్రాలను ఎక్కడికో తీసుకెళ్లి పోతున్నాడని ఎంజిఆర్ ఏ ఒనికిపోయారని రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. పద్మశ్రీ పురస్కారం పొందినటువంటి ఒక నటుడు బహిరంగ వేదిక పైన ఇలాంటి అసభ్య పదజాలాన్ని వాడడంతో చాలామంది రాజేంద్రప్రసాద్ పైన ఫైర్ అవుతున్నారు



ఒక నటుడు గొప్పతనాన్ని పొగిడే క్రమంలో, కోట్లాదిమంది ఆదరించే మరో దిగ్గజ నటుడిని ఇలా కించపరచడం సరైనది కాదు అంటూ అటు అభిమానులు నేటిజన్స్ సైతం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలు తమిళ సినీ పరిశ్రమతో పాటుగా అక్కడి ప్రజలలో తీవ్ర అసహనాన్ని కలిగించేలా చేస్తున్నాయి. ఎంజీఆర్ లాంటి నటుడిని ఉద్దేశిస్తూ రాజేంద్రప్రసాద్ మాట్లాడిన తీరు పట్ల తమిళ తంబీలు కూడా రాజేంద్రప్రసాద్ ట్రోల్ చేస్తున్నారు. రాజేంద్రప్రసాద్ ఇప్పుడే కాదు గతంలో కూడా బ్రహ్మానందం ఆలీ వంటి నటుల పైన కూడా చాలా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా ఎవరైనా సెల్ఫీ ఫోటో అడిగితే వారి మీద కోపగించుకున్న సందర్భానికి సంబంధించిన వీడియోలు కూడా వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: